Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనియన్ టీతో కరోనా నుంచి తప్పించుకోవచ్చా? (Video)

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (19:13 IST)
Onion Tea
ఉల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉల్లి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. ఉల్లిపాయలు క్యాన్సర్ కణాల నివారణకు ఉపయోగపడతాయి. కరోనా కాలంలో ఆహారంలో ఉల్లిని తప్పకుండా వాడాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే ఉల్లి పాయల రసాన్ని పావు లేదా అర కప్పు మేర తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. 
 
మజ్జిగలో ఉల్లి ముక్కలను చేర్చి తీసుకోవడం వంటివి, పెరుగులో ఉల్లి ముక్కలేసుకుని తీసుకోవడం మరిచిపోకూడదు. అలాగే ఉల్లి టీని సేవించడం ద్వారా ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
ఉల్లిపాయ‌ల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం ఉల్లిపాయ‌ల టీని తాగితే మంచిది. వారిలో షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. డ‌యాబెటిస్ వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. శ‌రీరంలో అవ‌య‌వాలు శుభ్రంగా మారుతాయి.
 
ద‌గ్గు, జ‌లుబు ఉన్న వారు ఉల్లిపాయ‌ల టీ తాగితే వెంట‌నే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే జ్వ‌రం కూడా త‌గ్గుతుంది. శ్వాస కోశ స‌మ‌స్య‌ల‌కు ఈ టీ అద్భుతంగా ప‌నిచేస్తుంది. హైబీపీ ఉన్న‌వారు ఉల్లిపాయల టీని తాగితే బీపీ త‌గ్గుతుంది. ర‌క్త‌స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. హృద్రోగ సంబంధిత రోగాలకు చెక్ పెడుతుంది. 
 
ఉల్లి టీని తయారు చేసే విధానం.. 
కావ‌ల్సిన ప‌దార్థాలు:
త‌రిగిన ఉల్లిపాయ - ఒక కప్పు
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
బిర్యానీ ఆకు - 2
తేనె - నాలుగు స్పూన్లు 
నీళ్లు - మూడు క‌ప్పులు
 
త‌యారీ విధానం:
ఓ పాత్రలో నీళ్లు పోసి మరిగాక.. అందులో ఉల్లిపాయల తరుగును చేర్చాలి. ఆపై వెల్లుల్లి, బిర్యానీ ఆకులను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగిన నీరు ముదురు బ్రౌన్ రంగులోకి వచ్చాక స్టౌవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఉల్లిపాయ‌ల టీ త‌యారైన‌ట్లే. అందులో కొద్దిగా తేనె క‌లుపుకుని దాన్ని వేడిగా ఉండ‌గానే తాగేయాలి. ఇలా నిత్యం ఉద‌యాన్నే ఈ టీ తాగితే మధుమేహం అదుపులో వుంటుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగడం ద్వారా కరోనా వంటి వ్యాధుల నుంచి దూరంగా వుండవచ్చు. 

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments