నేరేడు పండు షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట గొప్పవరం అని చెప్పవచ్చు. మధుమేహంతో బాధపడేవారు నేరేడు గింజల పొడిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని చక్కెర శాతాన్న తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇది అధిక రక్తపోటు సమస్యను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నేరేడు పండు రక్తాన్ని శుద్ది చేయడమే కాకుండా రక్తంలో కేన్సర్ కారకాలు వృద్ది చెందకుండా నిరోదిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ మరియు విటమిన్ సి రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.
నేరేడుపండు సోడియం, పొటాషియం, క్యాల్షియం, పాస్పరస్, మాంగనీస్, జింక్, విటమిన్ ఎ, సితో పాటు రైబోప్లెనిన్, పోలిక్ యాసిడ్లను సమృద్దిగా కలిగి ఉంది.
నేరేడు పండ్లను తినడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. నేరేడు గింజల పొడి ముఖానికి ప్యాక్‌గా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ నేరేడు పండు పురుషుల్లో శృంగార శక్తిని పెంచుతుంది.
నేరేడు పండు మన జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలకు ఇది ఒక చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. కడుపు ఉబ్బరం మరియు వాంతి అయ్యేలా ఉండే లక్షణాలను తగ్గిస్తుంది. మలబద్దకంతో పాటు మూత్ర సంబందిత సమస్యలను నివారిస్తుంది.
ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేస్తుంది. అనేక చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా కీళ్లనొప్పులను మరియు లివర్ సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతుంది.