Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అజీర్తి, కడుపునొప్పి, కడుపు ఉబ్బరానికి ఒకటే ఔషధం

Advertiesment
అజీర్తి, కడుపునొప్పి, కడుపు ఉబ్బరానికి ఒకటే ఔషధం
, శుక్రవారం, 29 మే 2020 (21:56 IST)
అమ్మ అల్లం, ఆవిడ బెల్లం అన్నది మన తెలుగు సామెత. పెళ్ళి కాకముందు తల్లికొంగు పట్టుకుని తిరిగిన అబ్బాయి, పెళ్ళయ్యాక పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు. అప్పటివరకూ తన అన్ని అవసరాలకు తల్లి మీద ఆధారపడ్డ కొడుకు కోడలి రాకతో తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధపడుతుంది. అందుకే తల్లి కోడలిని చూడగానే ఈ మాట అంటుంది. అమ్మం అల్లం అయినా ఆరోగ్యానికి ఎంతో మంచిది. అల్లాన్ని ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
 
అల్లం మానవ ఆరోగ్యానికి అద్వితీయమైన ప్రయోజనాలను చేకూర్చుతుందని అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఒక విధంగా అల్లం గొప్ప దివ్యౌషధమనే చెప్పాలి. భోజనానంతరం అల్లం ముక్క నోటిలో వేసుకుంటే అజీర్తి వల్ల సంభవించే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం సమసిపోతాయి. ఈ అల్లం సాధారణంగా ఉష్ణప్రదేశాలలో పెరుగుతుంది. ఇది సువాసన కలిగించే సుగంధ ద్రవ్యం. ఎన్నో సద్గుణాల కలిగి ఉన్న అల్లం ఆయుర్వేందలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఔషధాలన్నంటిలోను ఈ అల్లం అత్యవసరం.
 
జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధులను నివారించాలంటే అరస్పూన్ తెనెలో మరొక అరస్పూన్ అల్లపు రసం కలిపి త్రాగితే చాలావరకు నివారణ పొందవచ్చు. పైత్య ప్రకోపం వల్ల కళ్ళు తిరగడం, తల భారం అధికంగా ఉన్నట్లయితే ఒక చెంచా నిమ్మరసంలో మరొక స్పూన్ అల్లపురసం కలిపి తీసుకుంటే త్వరలో ఫలితం కనిపిస్తుంది.
 
తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటే ఒక చిన్న గ్లాసు మెంతులు కషాయంలో కొద్దిగా అల్లపు రసాన్ని కొద్దిగా తేనెను కలిపి తీసుకుంటే జ్వర బాధ నుంచి విముక్తి పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెయ్యిని తీసుకుంటే ఏమేమి ప్రయోజనాలు?