అపురూప ఆహార ఔషధ బీట్ రూట్. రక్తంలోని అధిక వేడిని అణచి, రక్తానికి చలువ చేయడం కోసం ఈ బీట్ రూట్‌ను పూర్వం తినేవారట. విటమిన్ బి, సి, ఫాస్పరస్, ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం వంటి మూల పదార్థాలున్నాయి.
బీట్‌రూట్ ఆలస్యంగా జీర్ణమై విరోచనాలను అరికడుతుంది. రక్తంలోని మలినాలను తొలగించి రక్తశుద్ధి చేస్తుంది. రక్తవృద్థి చేస్తుంది. వండి తినడం కన్నా పచ్చిదే రసం తీసి త్రాగితే ఎంతో మంచిది. బీట్‌రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ లేదా బొప్పాయి కలిపి జ్యూసు చేసుకుని దానికి తేనె కలిపి తాగితే మంచిది.
బీట్‌రూట్ రసం అనారోగ్య సమస్యలను సునాయాసంగా నయం చేస్తుందట. బీట్ రూట్ రసం, కాస్తంత చక్కెర కలిపి తీసుకుంటే సన్నగా ఉన్నవారు బలిష్టంగా ఎర్రగా తయారవుతారట. శరీరంలోని నలుపు రంగు ఎరుపుగా తిరుగుతుందట.
బీట్ రూట్ వల్ల శారీరక నీరసం, రక్తహీనత హరిస్తాయి. శరీరం పునరుజ్జీవనమవుతుంది. బీట్‌రూట్ రసంలో తేనె కలిపి తీసుకుంటే సహజ వ్యాధి నిరోధక శక్తి పెరిగి, వ్యాధి కారక వ్యర్థ పదార్థాలు విసర్జింపబడి క్రమంగా వ్యాధి కనుమరుగైపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.