బత్తాయి రసాన్ని వేసవిలో తప్పకుండా తీసుకోవాలి. ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా వేసవిలో శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీనిలో విటమిన్-సి పుష్కలంగా.. కాల్షియం, పొటాషియం, కాపర్ ఖనిజ పోషకాలు మెండుగా ఉంటాయి.
ఈ విటమిన్లు, ఖనిజాలు కావాల్సినంత రోగనిరోధక శక్తినిస్తాయి. ఆహారం సరిగా జీర్ణమవుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు, తక్కువ కెలోరీలు కావాలనుకునేవారు బత్తాయి రసాన్ని తీసుకోవాలి.
ఈ పండులోని విటమిన్-సి యాంటీ ఆక్సిడెంటుగా పనిచేసి ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలించి రోగనిరోధకతను పెంచుతుంది. క్యాన్సర్, గుండెజబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. బత్తాయిలోని ఫ్లేవనాయిడ్లు.. జీర్ణరసాలు, ఆమ్లాలు స్రావితమయ్యేలా చేసి అజీర్తి, మత్తును పోగొడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.