Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికున్ గున్యాకు చింత గింజలతో చెక్!

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (13:52 IST)
ఇపుడు అంతుచిక్కని జ్వరాలు వస్తున్నాయి. ఇలాంటివాటిలో చికున్ గున్యా, డెంగీ, స్వైన్ ఫ్లూ వంటివి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ, స్వైన్ ఫ్లూ బారినపడి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో చికున్ గున్యా జ్వరానికి చింత గింజలతో దూరం చేయొచ్చని తెలుస్తోంది. 
 
నిజానికి చింత ఎన్నో చింతల్ని తీరుస్తుందని మన పెద్దలు చెపుతుంటారు. మనం ఇళ్లల్లో చింతపండును ఉపయోగించి చింత గింజల్ని పారేస్తాం. అయితే ఆ చింత గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తాజాగా 'ఐఐటీ రూర్కీ'కి చెందిన పరిశోధకులు చింత గింజల్లో ఉండే ఓ ప్రోటీన్‌ చికున్‌ గున్యా జ్వరానికి విరుగుడుగా పని చేస్తుందని గుర్తించారు. 
 
ఆ ప్రోటీన్‌ చికున్‌ గున్యాను కలిగించే వైరస్‌ ఇన్ఫెక్షన్‌ ప్రభావాన్ని 64 శాతం తగ్గిస్తుందని తేల్చారు. చికున్‌ గున్యా ప్రభావిత కణాల్లోని 'వైరస్‌ ఆర్.ఎన్.ఏ' ప్రభావాన్ని 45 శాతం తగ్గించిందట. ఇది వైద్య శాస్త్రంలో ఓ అరుదైన విషయంగా పేర్కొంటూ వైరోలజీ జర్నల్‌ ఈ కథనాన్ని పబ్లిష్ చేసింది. ఈ ప్రోటీన్‌ టెస్ట్‌ని త్వరలో జంతువులపై పరీశీలించబోతున్నట్లు ప్రొఫెసర్‌ షల్లీ తోమర్‌ వెల్లడించారు. 
 
చింత గింజల్లో ఉండే పలు ఔషధ పదార్థాలు ఎముకలకు బ‌‌‌‌లాన్నిస్తాయి. చింతగింజల పొడిని పేస్ట్‌‌‌‌లా చేసి ఎముకలు విరిగిన చోటరాయాలి. అలా చేస్తే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. అంతేకాదు డయేరియా, చర్మంపై దురదలు, దంత సంబంధిత స‌‌‌‌మ‌‌‌‌స్యలు, అజీర్ణం, ద‌‌‌‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్లు, డయాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధులకు చింత గింజ చక్కని ఔషధంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Polavaram: జనవరి 2, 2025న పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం

వృద్ధ మహిళపై వీధికుక్కల గుంపు దాడి.. చివరికి ఏమైందంటే? (video)

ఉత్తరాఖండ్‌- 1,500 అడుగుల లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి (video)

Venu Swamy: అల్లు అర్జున్‌కు మార్చి 29 వరకు టైమ్ బాగోలేదు (video)

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments