Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ 300 మిల్లీ లీటర్ల పెరుగును తింటే...?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:25 IST)
పాలలో చేమిరి వేస్తే అదే పెరుగవుతుందనేది అందరికీ తెలిసిన విషయం. కానీ చేమిరిలో "ల్యాక్టోబేసిల్స్ బల్గేరికస్" అనబడే బ్యాక్టీరియా ఉంటుంది. పాలలో చేమిరి వేయడంతో ఆ పాలు "షుగర్ ల్యాక్టిక్ యాసిడ్‌"లోకి మారిపోతుంది. దీంతో పాలు పేరుకుని పెరుగుగా రూపాంతరం చెందుతుంది. పాలకన్నా పెరుగును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. 
 
తెల్ల రక్త కణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. వయసు పెరిగే కొద్దీ మనిషి పెరుగును తీసుకుంటుండాలి. దీంతో వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలానే చాలాకాలంగా పలు జబ్బులతో బాధపడేవారు తప్పనిసరిగా పెరుగును తీసుకోవాలి. పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటీ బయోటిక్ థెరపీ ఇచ్చే సందర్భంలో నియమానుసారం పెరుగు తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.  
 
ప్రతిరోజూ 300 మిల్లీ లీటర్ల పెరుగును తింటే ఆస్టియోపొరోసిస్, క్యాన్సర్ ఉదర సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. ప్రతిరోజూ ఆహారంతోపాటు పెరుగు తీసుకోవడం వలన శరీర వేడిని తగ్గిస్తుంది. జబ్బులను తరిమికొట్టే పెరుగు ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఉరుకులు-పరుగులమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో ఉదర సంబంధిత జబ్బులతో బాధపడుతుండడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి వారు తాము తీసుకునే ఆహారంలో పెరుగును తగినంత మోతాదులో తీసుకుంటుంటే ఎలాంటి జబ్బులు దరిచేరవంటున్నారు డైటీషియన్లు. 
 
భోజనం ద్వారా తీసుకునే విటమిన్లు, ఖనిజాలు సరిగా జీర్ణం కావు. ఇలాంటి సమయంలో పెరుగు తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగు తీసుకోవడం వలన జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. దీంతో ఉదరంలో తలెత్తే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చను. పెరుగు తీసుకోవడం వలన శరీరానికి అందవలసిన పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. దీంతోపాటు శరీర చర్మం కాంతివంతంగా తయారవుతుంది. 
 
కొందరికి తరచూ నోట్లో పుండు ఏర్పడడం లేదా పొక్కులు ఏర్పడడం జరుగుతుంటాయి. ఇలాంటి వారు ప్రతిరోజూ రెండు నుండి నాలుగుసార్లు నోట్లో పుండున్న చోట పెరుగు పూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. పెరుగు తీసుకోవడం వలన రక్తంలో ఏర్పడే ఇన్ఫెక్షన్‌ను అదుపులో ఉంచేందుకు తెల్ల రక్త కణాలు ఎంతగానో తోడ్పడుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments