నకిలీ కోడిగుడ్డును ఎలా కనిపెట్టాలో తెలుసా..?

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (12:37 IST)
ఇప్పటి కాలంలో ఎక్కడ చూసినా కల్తీ వస్తువులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బియ్యం నుండి బంగారం, డబ్బు వరకు.. ఇలా అన్నిట్లోనూ కల్తీ వస్తువులే తయారవుతున్నాయి. సాధారణంగా బియ్యం, పప్పులో రాళ్లు కలపడం.. ఇలా తినే పదార్థాలలో కేవలం కల్తీ మాత్రమే జరిగేది.. కానీ ఇప్పుడు ఏకంగా కల్తీకి బదులు నకిలీవే వచ్చేస్తున్నాయి. వీటితో ఆరోగ్యం పాడవడంమే కాకుండా.. వైద్యం కోసం డాక్టర్లకు పెట్టే ఖర్చు దాదాపు రూ.లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు కోడిగుడ్లలో కూడా నకిలీ గుడ్లు వచ్చేసాయి. 
 
కొన్ని ప్ర‌త్యేక ప‌దార్థాల‌ను, ర‌సాయ‌నాల‌ను ఉప‌యోగించి త‌యారు చేస్తున్న ఈ నకిలీ కోడిగుడ్లు ఎక్కువ‌గా చైనాలో త‌యార‌వుతున్నాయని ఇటీవలే ఓ పరిశోధనలో నిపుణులు వెల్లడించారు. అందువలన.. ఈ కొన్ని చిట్కాలు తెలుసుకుంటే న‌కిలీ, అస‌లు కోడిగుడ్ల‌ను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు… 
 
1. అస‌లు కోడిగుడ్డుకు షైన్ కొద్దిగా త‌క్కువ‌గా ఉంటుంది. కల్తీ కోడి గుడ్డు మెరుస్తుంది.
2.  నకిలీ కోడిగుడ్డును ప‌గ‌ల గొట్ట‌గానే అందులోని ద్ర‌వాలు మ‌న ప్రమేయం లేకుండానే సుల‌భంగా క‌లిసిపోతాయి.
3. న‌కిలీ గుడ్ల‌కు అస‌లు నీచు వాస‌న ఉండ‌దు. అస‌లు కోడిగుడ్ల‌కు ఎంత లేద‌న్నా కొద్దిగా నీచు వాసన వ‌స్తుంది. 
4. అస‌లైన గుడ్డు క‌న్నా న‌కిలీ కోడిగుడ్డును పైన తాకితే గట్టిగా అనిపిస్తుంది. 
5. కోడిగుడ్డును కొనేటప్పుడు ఊపి చూడాలి. లోపల నుంచి ఏవైనా సౌండ్స్ వ‌స్తే దాన్ని న‌కిలీగా గుర్తించాలి. ఎందుకంటే న‌కిలీ గుడ్డు అయితే దాంట్లోని కెమిక‌ల్ ద్ర‌వాలు సుల‌భంగా క‌రిగిపోతాయి కాబ‌ట్టి. 
6. గుడ్డును చిన్న‌గా ట‌క్‌ ట‌క్‌మ‌ని కొట్టి చూడాలి. అస‌లు కోడిగుడ్డు అయితే ట‌క్ ట‌క్‌మ‌ని బాగా వినిపిస్తుంది. 
7. న‌కిలీ గుడ్ల‌లో ప‌చ్చ‌ని సొన కొన్ని సార్లు మ‌ధ్య‌లో తెల్ల‌గా క‌నిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan Anakapalle Tour: జగన్ రోడ్ టూర్‌కు అనుమతి నిరాకరణ

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి... 158 మందికి తప్పిన ప్రాణముప్పు

నకిలీ మద్యం కేసు : ములకల చెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు: కాకినాడలో ఉన్నతి ఫౌండేషన్ కొత్త వృత్తి శిక్షణా కేంద్రం ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

తర్వాతి కథనం
Show comments