Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలబంద గుజ్జుతో పళ్లు తోముకుంటే.. నోటి దుర్వాసన..?

కలబంద గుజ్జుతో పళ్లు తోముకుంటే.. నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని దాన్ని టూత్‌పేస్టుపై వేసి దంతాలను తోముకుంటే.. దంత సమస్యలుండవు. దంతాలు, చిగుళ్ల సమస్యలు తొలగిపోతాయి.

Webdunia
సోమవారం, 9 జులై 2018 (11:31 IST)
కలబంద గుజ్జుతో పళ్లు తోముకుంటే.. నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని దాన్ని టూత్‌పేస్టుపై వేసి దంతాలను తోముకుంటే.. దంత సమస్యలుండవు. దంతాలు, చిగుళ్ల సమస్యలు తొలగిపోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.


దంతాలపై గార, పాచి తొలగి..దంతాలు తెల్లగా, దృఢంగా మారుతాయి. కలబంద గుజ్జును రోజుకో స్పూన్ తీసుకుంటే.. చ‌ర్మం సంర‌క్షింప‌బ‌డుతుంది. చ‌ర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మ‌చ్చ‌లు పోతాయి. అలాగే శిరోజాలు ప్ర‌కాశంతంగా మారుతాయి. 
 
వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. శ‌రీరంలో ఏర్ప‌డే క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేసే గుణాలు క‌ల‌బంద‌లో ఉంటాయి. క‌ల‌బంద‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ్యాధి రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. క‌ల‌బంద‌లో ఉండే యాంటీ ఇన్‌ప్లామేట‌రీ గుణాలు నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తాయి. 
 
కలబంద హైబీపీని తగ్గిస్తుంది. అధిక బ‌రువు ఉన్న వారు రోజూ క‌ల‌బంద‌ను తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది. శ‌రీర మెట‌బాలిజాన్ని పెంచి కొవ్వును క‌రిగించే గుణాలు క‌ల‌బంద‌లో ఉంటాయి. అందువ‌ల్ల అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments