కూర్చుని చేసే పని.. కొవ్వు పేరుకుపోతోంది, కరిగించడం ఎలా?

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (22:36 IST)
జీవనశైలిలో మార్పులు వచ్చేశాయి. ఈ జీవన విధానం కారణంగా మనిషి తీసుకునే ఆహారంలో కూడా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేళకు సరైన ఆహారం తీసుకోకుండా ఆ సమయానికి అందుబాటులో ఉన్నది ఏదో ఒకటి తీసుకుని భోజనం అయిందని అనిపిస్తాం. నిజానికి ఇలాంటి ఆహారం వల్లే స్థూలకాయం బారిన పడుతున్నట్టు అనేక అధ్యయాలు వెల్లడిస్తున్నాయి. 
 
ఒక్కసారి స్థూలం కాయం బారిన పడిన తర్వాత దాన్ని తగ్గించేందుకు యోగా, వ్యాయామం, వాకింగ్ ఇలా ఎన్నో చేస్తుంటాం. అయితే, అయినప్పటికీ.. శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇలాంటి కొవ్వును మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో మనం తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్ధాం. 
 
విటమిన్ 'సి' పుష్కలంగా ఉండే నిమ్మకాయలో కొవ్వును కరిగించే లక్షణాలు ఉన్నాయి. దీనికి మలబద్దకాన్ని తగ్గించి జీర్ణక్రియను పెంచుతుందట. ఐరన్‌లోపంతో బాధపడేవారు తొందరగా నీరసించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎక్కువ కేలరీలు ఉన్న స్నాక్స్ తీసుకునే బదులు లెమన్ జూస్‌తో కూడిన సలాడ్ తీసుకుంటే ఎక్కువ శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరంలోని కొవ్వును కూడా కరిగిస్తుందని వైద్యులు చెపుతున్నారు. 
 
అలాగే, వంటింట్లో అందుబాటులో ఉండే లవంగాలు, మిర్చి, దాల్చిన చెక్క వంటివి కూరల్లో ఎక్కువగా వాడటం వల్ల శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయట. ఈ వేడి శరీర జీర్ణక్రియలో కొద్దిపాటి వృద్ధిని కలిగిస్తుంది. దీనివల్ల బాడీలో ఫ్యాట్ తగ్గే అవకాశం ఉందని వారు అంటున్నారు. 
 
ప్రధానంగా టమోట, కీరదోస, గుమ్మడిల్లో తక్కువ కేలరీస్ ఉంటాయి. కానీ, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేయదు. ఫైబర్ జీర్ణమవ్వడానికి శరీరం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల కొవ్వు సులభంగా కరిగిపోతుంది. వీటితో ఎక్కువ విటమిన్స్, మినరల్స్ శరీరానికి అందించడమే కాకుండా యాంటీఆక్సిడెంట్స్ జీర్ణక్రియను, శక్తిని స్థాయిలో ఉంచుతాయని పేర్కొంటున్నారు. 
 
వీటితో పాటు.. బాదంపప్పు, కొబ్బరి నూనె, కోడిగుడ్లు, ఆలివ్ ఆయిల్, తేనె, మజ్జిగ, వెల్లుల్లితో కూడా శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని గృహ వైద్యులు చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇక కాస్కోండి... మా దెబ్బ రుచిచూపిస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

హలో, నా భార్య చనిపోయింది, నా బాగోగులు చూసుకునేందుకు 45 ఏళ్ల మహిళ కావాలి: వృద్ధుడు వీడియో

భర్త మృతితో దారితప్పిన అక్క ... హెచ్చరించినా మారని తీరు.. చంపేసిన తమ్ముడు

ఏపీలో అకాలవర్షాలు, అమరావతిలో పిడుగుపడి వ్యక్తి మృతి

కడప ఎంపీ టిక్కెటి విషయంలోనే గొడవ - చిన్నాన్న హత్య : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ

రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?

న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్

Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ

Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి

తర్వాతి కథనం
Show comments