Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బ‌రినీళ్లు, తేనె మిశ్ర‌మాన్ని పరగడుపున తీసుకుంటే?

కొబ్బరి నీళ్లలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. కొబ్బరి నీటిలో ఎన్నో పోషకాలున్నాయి. ఇవి శరీరాన్ని ఉల్లాసంగా వుంచుతాయి. అలాగే తేనెలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లున్నాయి. ఇది స‌హ‌జ సిద్ధ‌మైన యాం

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (11:45 IST)
కొబ్బరి నీళ్లలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. కొబ్బరి నీటిలో ఎన్నో పోషకాలున్నాయి. ఇవి శరీరాన్ని ఉల్లాసంగా వుంచుతాయి. అలాగే తేనెలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లున్నాయి. ఇది స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్ కార‌కంగా ప‌నిచేస్తుంది. ఈ క్ర‌మంలో ఉద‌యాన్నే ఒక గ్లాస్ కొబ్బ‌రి నీళ్ల‌లో ఒక టేబుల్ స్పూన్ తేనెను క‌లుపుకుని ప‌ర‌గ‌డుపునే తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
కొబ్బ‌రినీళ్లు, తేనె మిశ్ర‌మంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ ఎ.. వృద్ధాప్య ఛాయలు లేకుండా చేస్తాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే ముడ‌తలు పోతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. కొబ్బ‌రినీళ్లు, తేనె మిశ్ర‌మాన్ని నిత్యం తాగుతుంటే జీర్ణ వ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి స‌మ‌స్య‌లు పోతాయి. అల్స‌ర్లు ఉంటే న‌య‌మ‌వుతాయి.
 
కొబ్బ‌రినీళ్లు, తేనె మిశ్ర‌మాన్ని తీసుకుంటే.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. దీంతో అధికంగా ఉన్న బ‌రువు త‌గ్గుతారు. మిశ్ర‌మంలో ఔష‌ధ గుణాలు మెండుగా ఉండ‌డం వ‌ల్ల అది శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఇంకా కిడ్నీలోని వ్యర్థాలు కూడా తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు అలాంటి ఇబ్బంది కలిగించని చంద్రబాబు.. ఏంటది?

తొలిస్పీచ్‌తోనే అదరగొట్టిన పవన్.. సభ అంటే అలా వుండాలి.. (వీడియో)

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్.. చంద్రబాబు (video)

రుషికొండ ప్యాలెస్‌.. రూ.500 కోట్లు ఖజానాకు నష్టం.. సుప్రియా రెడ్డి?

అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు- ఆ ఇద్దరికి ధన్యవాదాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పేక మేడలు నుంచి ఫస్ట్ సింగిల్ 'బూమ్ బూమ్ లచ్చన్న సాంగ్ విడుదల

కాశీ, కాంప్లెక్స్, శంబాలా గురించి రివిల్ చేసిన కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్

అడవి శేష్ పేరు మారిపోయింది.. ఇందుకు సన్నీ లియోన్‌నే కారణమా?

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments