Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యవంతమైన జీవితానికి ఇలా చేయాల్సిందే..?

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (14:44 IST)
జీవితంలో ఉదయం నిద్రలేచిన తొలి క్షణాల్లో బద్దకాన్ని కాస్త విడనాడి హుషారుగా ఉంటే ఆ రోజంతా దినవారీ కార్యక్రమాలను చలాకీగా నిర్వహించుకోవచ్చు. నిద్రలేచినప్పటి నుండి ఇంటి పనులు, ఆఫీసుకు పరుగెత్తడం వంటి వాటితో సతమతమయ్యే మహిళలు కొందరైతే.. నింపాదిగా పనులు చేసుకుపోయే వారు మరికొందరు. కాగా సమయానికి ఏ పనీ కాదేమోనని ఆలోచనలలో పడిపోయి రక్తపోటు పెంచుకునేవారు ఇంకొందరు. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
 
1. నిద్రలేచిన వెంటనే శరీరం తిరిగి శక్తిని సంతరించుకోవాలంటే ద్రవపదార్థాలు అవసరం. కనుక లేచిన వెంటనే గోరువెచ్చటి నీటిలో రెండు చెంచాల తేనె, నిమ్మకాయ రసం కలిపి సేవిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
2. దినచర్యలో మొదట మనసుకు నచ్చిన పనులు జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో 5 నిమిషాలు కబుర్లు చెప్పడం, వార్తా పత్రిక చూడడం,  ఇష్టమైన పాటలు వినటం వంటివి చేయటం వలన ఆ రోజును ఏ పని చేయాలనుకున్నా ఉత్సాహంగా చేస్తారు. 
 
3. ఒళ్ళెరగకుండా నిద్రపోయి గాభరా పడేవారు ఉదయ సూర్యకాంతి.. శరీరానికి నేరుగా తగిలేలా పడకగదిని అమర్చుకుంటే ప్రతిరోజూ కాంతి సోకగానే లేవటం అలవాటవుతుంది. అలా వీల్లేదంటే లైట్‌ అమర్చివున్న అలారంను బెడ్‌ రూమ్‌లో అమర్చుకుంటే చాలు.
 
4. నిద్రలేవగానే చేయాల్సిన పనుల జాబితా గుర్తుకొచ్చి హడావుడిగా లేవడం వంటివి చేయకుండా పడకమీదే శరీరాన్ని సాగదీయాలి. దీంతో విశ్రాంతి తీసుకుని బిగుతు అయిన కండరాలు పట్టువదలి రక్త ప్రసరణ చైతన్యవంతమవుతుంది. 
 
5. శరీరం మొత్తాన్ని అంటే కాళ్ళు చేతులు, వీపు, ఉదరం అన్ని అంగాలూ కదిలేలా శరీరాన్ని బలంగా విరుచుకోవాలి. తరువాత లేచినిలబడి చేతులను పైకి ఎత్తి వ్యతిరేక దిశలో ఓ పదిసార్లు గుండ్రంగా తిప్పితే శరీరం ఉత్సాహభరితం అవుతుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments