Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్వుతున్నారా లేదా? నవ్వితే ఏంటి నవ్వకపోతే ఏంటి?

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (19:59 IST)
ప్రపంచంలో మనుషులు తప్ప మిగిలిన ప్రాణులకు నవ్వడం, ఏడ్వడం తెలియదు. కాని వాటి భావాలను మాత్రం వ్యక్తపరుస్తుంటాయి. మనిషి అలా కాదు. అతనికి ఏడుపు వచ్చినా, నవ్వు వచ్చినా వెంటనే ముఖకవళికలలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి.

మనిషి శరీరంలోని రక్తప్రసరణను క్రమబద్ధీకరించే శక్తి నవ్వుకు మాత్రమే ఉంది. ప్రాణవాయువు, న్యూట్రిషన్స్‌ శరీరానికి ఎంత అవసరమో, నవ్వుకూడా అంతే అవసరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. బిగ్గరగా నవ్వడం వలన ఉదరం, కాళ్లు చేతులు, ముఖ కండరాలు అన్నింటికీ  వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది. 
 
శరీరానికి అందించే ఆహారం ద్వారా తీసుకున్న క్యాలరీలు ఖర్చు కావాలంటే నవ్వు తప్పనిసరి. అంటే నవ్వు ద్వారా బరువు తేలికగా తగ్గవచ్చు. ఇవి శారీరకమైన లాభాలు. అలాగే నవ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు మానసిక బలాన్ని కూడా అందిస్తుందనడంలో సందేహం లేదంటున్నారు పరిశోధకులు.
 
మనిషిలోని స్వచ్ఛమైన నవ్వుకి, ముఖంలోని హావభావాలకి దగ్గరి సంబంధం ఉన్నట్లే శరీరంలో జరిగే పలు రసాయన మార్పులకి కూడా సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. శరీరంలో ఎంజైములు, హార్మోనులు విడుదల కావడానికి ఆరోగ్యవంతమైన నవ్వు దోహదపడుతుంది. ఎంజైములు, హార్యోన్లు శరీర అవయవాల పనితనాన్ని మెరుగు పరుస్తాయని పరిశోధకులు తెలిపారు.
 
అధిక రక్తపోటుతో బాధపడేవారు రక్తపోటును క్రమబద్దీకరించుకునేందుకు మందులతో పనిలేకుండా ప్రతి రోజు కాసేపన్నా మనసారా నవ్వుతుంటే రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుందని పరిశోధకులు సూచించారు. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. హార్మోన్లలో అసమానతల కారణంగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. దీంతో నవ్వు శరీరంలోని హార్మోను ఉత్పత్తుల హెచ్చుతగ్గులను క్రమబద్దీకరిస్తుంది. మనసారా నవ్వడం వలన ఒత్తిడి, ఆందోళన మాటుమాయం అవుతుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments