Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుచ్చకాయ తింటే ఏం జరుగుతుంది?

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (22:14 IST)
పుచ్చకాయలో తక్కువ కేలరీలు, పీచుతో పాటు పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఇది హైపర్ టెన్షన్‌ను దూరం చేస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలను పుచ్చకాయ నయం చేస్తుంది. పుచ్చకాయ రక్తపోటును తగ్గించడంతో పాటు రక్తనాళాలను పెద్దవి చేస్తుంది. 
 
పుచ్చకాయలో అత్యధికంగా ఎ విటమిన్, బీ6, సీ విటమిన్లున్నాయి. పీచుపదార్ధం సమృద్ధిగా వుంది. పొటాషియం లభిస్తుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం ద్వారా హృద్రోగాలకు దూరం చేసుకోవచ్చు. 
 
పుచ్చకాయ తింటే నేత్రదృష్టి పెరుగుతుంది. శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. దాహాన్ని తీరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి పుచ్చకాయను పచ్చిగానే తినడం బోర్ కొడితే అందులో అరకప్పు పుదీనా ఆకులను చేర్చి.. స్లాష్‌ తాగితే రుచిగా ఉంటుంది. పుచ్చకాయ పుదీనా స్లాష్ ఎలా చేయాలో చూద్దాం. 
 
కావలసిన పదార్థాలు : 
పుచ్చ ముక్కలు - నాలుగు కప్పులు 
పుదీనా ఆకులు - అర కప్పు 
ఐస్ క్యూబ్స్ - అర కప్పు 
తేనే - అర కప్పు 
 
తయారీ విధానం:  
ముందుగా ఐస్ క్యూబ్స్‌ని బ్లెండర్‌లో వేసి, దాని పై మూతను పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పుచ్చ ముక్కలను కూడా ఐస్ ముక్కలతో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆపై పుదీనా ఆకులను కూడా చేర్చి బ్లెండర్‌లో వేసి రుబ్బుకోవాలి. చివరిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే రుచికరమైన పుదీనా పుచ్చ స్లాష్ రెడీ అయినట్లే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

Pahalgam: వెళ్ళు, మీ మోదీకి చెప్పు.. బాధితుడి భార్యతో ఉగ్రవాదులు

పహల్గామ్ దాడి.. విమానాశ్రయంలోనే ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

తర్వాతి కథనం
Show comments