Webdunia - Bharat's app for daily news and videos

Install App

బానపొట్టకు కారాణాలివే..?

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (10:06 IST)
సరియైన ఆహారపు అలవాట్లను పాటించకపోవడం, తగిన వ్యాయామం లేకపోవడం వలన అధికబరువు సమస్య మొదలవుతుంది. అంతేకాదు ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోలేక, ఆ తర్వాత ఆదరాబాదరాగా అమితమైన ఆహారాన్ని తీసుకోవడం వలన పొట్ట పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మొత్తంమ్మీద బానపొట్టతో బండబరువుతో సతమతమైపోతారు. ఈ బానపొట్టను, అధిక బరువుకు కారణాలేమిటో చూద్దాం. 
 
శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకోవడం. భోజనానికి మధ్య విరామం లేకుండా ఏదో ఒకటి తినడం. మానసికంగా ఒత్తిడికి గురి అయినప్పుడు తీసుకునే ఆహారం మోతాదు ఎక్కువ అవుతుంది. ఫలితంగా లావు పెరగడం ప్రారంభమవుతుంది. 
 
అంతేకాదు కొన్ని రకాల మందులు కూడా అధిక బరువుకు కారణమవుతాయి. స్త్రీలలో గర్భసంచి తొలగింపు సర్జరీ చేయడం వలన ఈ స్థూలకాయం సమస్య ఎదురవుతుంది. హార్మోన్ల అసమతౌల్యం వలన కూడా అధిక బరువు సంతరించుకుంటుంది. 
 
ప్రతిరోజూ కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరిగి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. 
 
పండ్లు, పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు తీసుకుంటుండాలి. మాంసాహారం, వేపుళ్లు, బేకరి ఫుడ్స్, ఐస్‌క్రీమ్స్, కేక్స్, బిర్యానీ వంటి వాటిని మానివేయాలి. భోజనానికి మధ్య చిరుతిండ్లను మానివేయాలి. అధికంగా ఉప్పు, స్వీట్లను తీసుకోకూడదు. 
 
తగినంత నీటిని తాగాలి. కనీసం రోజుకు 4 లీటర్ల నీరు తాగాలి. అయితే బరువు అనేది ఏదో నెలకో రెండు నెలలకో తగ్గిపోతుందని అనుకోవడం పొరపాటు. బరువు పొట్ట తగ్గడానికి నియమిత ఆహార ప్రణాళిక క్రమబద్ధమైన జీవన విధానాన్ని దీర్ఘకాలికంగా ఉండాలన్నది గుర్తుంచుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క

తెలంగాణాలో అతి భారీ వర్షాలు.. ఎప్పటి నుంచో తెలుసా?

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

తర్వాతి కథనం
Show comments