Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎడమవైపుకు తిరిగి పడుకోవడం వలన గురక పోతుందట..?

Advertiesment
ఎడమవైపుకు తిరిగి పడుకోవడం వలన గురక పోతుందట..?
, మంగళవారం, 26 మార్చి 2019 (18:15 IST)
భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం (జీర్ణం) చేయడానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది. మెదటిగా మెదడులోని రక్తం , తర్వాత ఇతర భాగాలలోని రక్తమంతా తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది. అప్పుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది. అందువలన నిద్ర వస్తుంది. నిద్రపోవడం మంచిది. 
 
ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఏదైనా కారణం చేత విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయండి. రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రపోకూడదు. కనీసం 2 గంటల వ్యవధి పాటించాలి. మీరు వెంటనే నిద్రపోయినట్లయితే డయాబెటీస్, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది.
 
ఎడమ ప్రక్కకు తిరిగి, ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని నిద్రపోవాలి. దీనిని వామ కుక్షి అవస్థలో విశ్రమించటం అంటారు. మన శరీరంలో సూర్యనాడి, చంద్రనాడి మరియు మధ్యనాడి అనే మూడు నాడులుంటాయి. సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చేయడానికి పనికొస్తుంది. ఈ సూర్యనాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది. 
 
మీరు అలసత్వానికి గురైనప్పుడు, ఇలా ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వలన అలసత్వం తొలగిపోతుంది. మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతారు. ఇలా పడుకోవడం వలన ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గురక పోతుంది, గర్భిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరిగుతుంది. భోజనం బాగా జీర్ణమవుతుంది. వీపు మెడ నొప్పులు తగ్గుతాయి. 
 
తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విషపదార్ధాలు బయటికి వెళ్లిపోతాయి. కాలేయ, మూత్రపిండ సమస్యలు ఉండవు. పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోల్ చేస్తుంది. తూర్పు మరియు దక్షిణం వైపు మాత్రమే తలపెట్టి పడుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ నియమాలను పాటిస్తే 120 రోగాలకు దూరంగా వుండొచ్చట..