Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీరకాయలో ఉన్న మేలెంతో తెలుసా? మందుబాబులకు బీరకాయ దివ్యౌషధం..

బీరకాయలో ఉన్న మేలెంతో తెలుసుకుంటే.. అస్సలు దాన్ని వదిలిపెట్టరు. సాధారణ, నేతి బీరకాయ- రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్‌-సి, జింక్‌, ఐరన్‌, రిబోఫ్లేవిన్‌, మెగ్నీషియం, థైమీన్‌... వంటి పోషకాలు పుష్కలంగ

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (11:13 IST)
బీరకాయలో ఉన్న మేలెంతో తెలుసుకుంటే.. అస్సలు దాన్ని వదిలిపెట్టరు. సాధారణ, నేతి బీరకాయ- రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్‌-సి, జింక్‌, ఐరన్‌, రిబోఫ్లేవిన్‌, మెగ్నీషియం, థైమీన్‌... వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీరకాయలోని పెప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ రక్తంలోని, యూరిన్‌లోని చక్కెర నిల్వల శాతాన్ని చాలామటుకు తగ్గించేందుకు తోడ్పడతాయి. 
 
బీరకాయ రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ కూడా తోడ్పడుతుంది. ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది. మందుబాబుల తీసుకునే ఆహారంలో బీరకాయ చేర్చితే వారి కాలేయానికి ఎలాంటి ఢోకా ఉండదు. కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుందనీ దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావనీ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుందనీ తేలింది.
 
అల్సర్లూ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. బీరకాయలోని విటమిన్‌-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులోని విటమిన్‌ బి5 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందట. అంతేగాకుండా బీరకాయల్లోని విటమిన్‌ బి6 అనీమియాను నివారించగలదని కూడా ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments