Webdunia - Bharat's app for daily news and videos

Install App

బఠాణీలు తినండి.. ఇమ్యూనిటి పెంచుకోండి... కొలెస్ట్రాల్ తగ్గించుకోండి..

బఠాణీలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే బఠాణీలు ఇమునిటీని పెంచుతాయి. సంతాన లేమికి బఠాణీలు బేష్‌గా పనిచేస్తాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్ పుష్కల

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (11:05 IST)
బఠాణీలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే బఠాణీలు ఇమునిటీని పెంచుతాయి. సంతాన లేమికి బఠాణీలు బేష్‌గా పనిచేస్తాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇక కణాల్లోని డీఎన్ఏ తయారీకి ఫోలేట్లు అవసరం.

అందుకే ఫోలేట్లు సమృద్ధిగా ఉండే బఠాణీలను తీసుకోవడం ద్వారా గర్భం ధరించడం సులువవుతుంది. ఇక గర్భంగా ఉన్నప్పుడు బఠాణీలు తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డలో నాడీ సంబంధ సమస్యలు లేకుండా చేస్తాయి. 
 
బఠాణీల్లో ఫైటోస్టెరాల్స్‌ ముఖ్యంగా బీటా సైటోస్టెరాల్‌ లభ్యమవుతుంది. ఈ రకమైన స్టెరాల్స్‌ శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి. తాజా బఠాణీల్లో కె-విటమిన్‌ శాతమూ ఎక్కువే. ఎముక బరువు పెరగడానికి ఇది ఎంతో అవసరం.
 
ఆల్జీమర్స్‌, ఆర్థ్రైటిస్‌... వంటి వ్యాధుల్ని అరికట్టేందుకూ ఇది తోడ్పడుతుంది. ఇక బఠాణీల్లో యాంటీ యాక్సిడెంట్లు ఫేవనాయిడ్స్ జియాక్సాంథిన్, ల్యూటెన్, విటమిన్‌-ఎ... వంటి కెరొటినాయిడ్లూ పుష్కలంగా దొరుకుతాయి. అందుకే ఇవి కంటి ఆరోగ్యానికీ ఎంతో మంచివని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments