Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యారెట్‌ను వంటల్లో కాదు.. ఇలా ట్రై చేసి చూడండి..

క్యారెట్‌ను వంటల్లో చేర్చుకుంటుంటారు. అయితే క్యారెట్‌ను ఉడికించకుండా పచ్చిగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. క్యారెట్ జ్యూస్‌ను తీసుకోవడం ద్వారానూ ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. క్యారెట్‌

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (14:44 IST)
క్యారెట్‌ను వంటల్లో చేర్చుకుంటుంటారు. అయితే క్యారెట్‌ను ఉడికించకుండా పచ్చిగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. క్యారెట్ జ్యూస్‌ను తీసుకోవడం ద్వారానూ ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. క్యారెట్‌ రసాన్ని తరచూ తీసుకోవడమే కాదు, అందులో కాస్త తేనె కలిపి చూడండి. జలుబూ, గొంతు నొప్పి త్వరగా తగ్గుతాయి. క్యారెట్‌లో ఏ, సి, కె విటమిన్లూ, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ఏ విటమిన్‌ ఊపిరితిత్తుల్లో కఫం చేరకుండా చేస్తుంది. ఇక, సి విటమిన్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. 
 
ఓ పాత్రలో పలుచగా కోసిన రెండు క్యారెట్ల ముక్కలూ, చెంచా అల్లం తరుగూ, నిమ్మకాయ రసం, కొద్దిగా తేనె వేసి మూత పెట్టేయాలి. ఈ నీటిని మరుసటి రోజు తాగితే జీర్ణసంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎముకలూ దృఢంగా మారతాయి. కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం ఉంటుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. 
 
అలాగే చర్మసంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే క్యారెట్ తురుమును పిల్లలకు నచ్చే రీతిలో ఐస్‌క్రీముల్లో కలిపి ఇవ్వడం చేస్తే.. పిల్లల్లో ఏర్పడే కంటి దృష్టి లోపాలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments