రెండు యాలకులు, ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు ఎంత ఆరోగ్యమో...
యాలకులను ఇంట్లో మసాలా దినుసులు గాను, మౌత్ ప్రెష్ నర్ గా వాడుతుంటారు. టీ తయారీలో యాలకులను ఉపయోగిస్తుంటారు. రెండు యాలకులు తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. యాలకులు కఫ్ఫం, దగ్గు, ఆస్తమా వ
యాలకులను ఇంట్లో మసాలా దినుసులు గాను, మౌత్ ప్రెష్ నర్ గా వాడుతుంటారు. టీ తయారీలో యాలకులను ఉపయోగిస్తుంటారు. రెండు యాలకులు తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. యాలకులు కఫ్ఫం, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులతో పాటు కడుపులో మంటను నివారిస్తుందట.
హృదయ ఆరోగ్యానికి సహకరించడంతో పాటు మానసిక ఒత్తిడిని నియంత్రిస్తాయిట. మూత్రపిండాల్లో రాళ్ళను కరిగిస్తాయి. ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు యాలకులను తీసుకోవడం ఉత్తమం. పొట్ట పెరిగిపోయి ఇబ్బందిగా తయారైనప్పుడు యాలకుల వైద్యం దానికి చక్కని పరిష్కారమార్గం.
ఇందుకోసం పడుకునే ముందు రెండు యాలకులు తిని ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళు తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యాలకుల్లో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి దోహపడతాయి. అలాగే యాలకులలోని ఫైబర్, కాల్షియంలు శరీర బరువును నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నాయి.