Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ టీని ఎక్కువగా తాగుతున్నారా..? ఈ సమస్యలు వస్తాయట..!

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:26 IST)
గ్రీన్ టీ గురించి మీరు ఇది వరకే విని ఉంటారు. గ్రీన్ టీ నిత్యం తాగడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిసిందే..గ్రీన్ టీ తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. 
 
అయితే గ్రీన్ టీ శరీరానికి మంచిదే కదా అని చాలా మంది పనికట్టుకుని కప్పుల కొద్దీ గ్రీన్ టీని నిత్యం తాగుతుంటారు. నిజానికి అది మంచిది కాదు. దాని వల్ల ఆరోగ్యకర ప్రయోజనాలు కలగకపోగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఓ సారి చూడండి..!
 
* గ్రీన్ టీని అధికంగా తాగడం వల్ల జీర్ణాశయంలో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా ఎసిడిటీ వస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ మందగిస్తుంది.
 
* గ్రీన్ టీ ఎక్కువగా తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి గ్రీన్ టీని నిత్యం 2 లేదా 3 కప్పులకు మించకుండా తాగాలి.
 
* గ్రీన్ టీ అధికంగా తాగడం వల్ల మన శరీరంలో హార్మోన్ల పనితీరు సమతుల్యత దెబ్బ తింటుంది. ప్రధానంగా హార్మోన్ల సమస్యలు వస్తాయి.
 
* గ్రీన్ టీ ఎక్కువగా తాగితే మనం తింటున్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం ఎక్కువగా శోషించుకోలేదు.
 
* గ్రీన్ టీని అధికంగా తాగడం వల్ల హైబీపీ వస్తుంది. దీంతో పాటు రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments