Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకుకూరలు వండేటప్పుడు ఈ టిప్స్ పాటించండి..

ఆకుకూరలు వండేటప్పుడు ఈ టిప్స్ పాటించండి.. ముందుగా ఆకుకూరలను రెండు మూడుసార్లు కడగాలి. ఎందుకంటే..? చిన్న పురుగులు, దుమ్ము, వంటివి తొలగిపోతాయి. కడిగేటప్పుడు పావు స్పూన్ ఉప్పు వేసి శుభ్రం చేస్తే ఇంకా మంచి

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2017 (13:11 IST)
ఆకుకూరలు వండేటప్పుడు ఈ టిప్స్ పాటించండి.. ముందుగా ఆకుకూరలను రెండు మూడుసార్లు కడగాలి. ఎందుకంటే..? చిన్న పురుగులు, దుమ్ము, వంటివి తొలగిపోతాయి. కడిగేటప్పుడు పావు స్పూన్ ఉప్పు వేసి శుభ్రం చేస్తే ఇంకా మంచిది. ఇలా చేయడం ద్వారా క్రిములు చనిపోతాయి. అలాగే ఆకుకూరలను వండే సమయంలో మూత పెట్టి వండటం ద్వారా పూర్తి పోషకాలు లభిస్తాయి. 
 
ఆకుకూరలు ఉడికించిన తర్వాత ఆ నీటిని పారేయకుండా ఉప్పు, నిమ్మరసం కలిపి సూప్‌ గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆకుకూరల్లో రోజుకో రకం బచ్చలి, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, తోట కూర, కొయ్యతోటకూర, అవిశాకు, మునగాకు, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూరను ఎక్కువగా వాడాలి. ఆయా కాలంలో చౌకగా దొరికే ఆకు కూరలను ప్రతిరోజు ఏదో రూపంలో వాడడం మంచిది. 
 
పెసర పప్పు, పాలకూర, కరివేపాకు పొడి, పుదీనా పచ్చడి, గోంగూర పప్పు, ఆకుకూర పకోడి, బచ్చలి-బజ్జి వంటి వెరైటీలుగా ఆకుకూరల్ని ఆహారంలో చేర్చుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments