Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయిల్ పాలిష్‌తో అమ్మాయిల్లో ఆ మార్పు... ఇది తెలిస్తే ఇక వేసుకుంటారా?

Webdunia
గురువారం, 4 జులై 2019 (17:41 IST)
అమ్మాయిలు చేతి వేళ్లు అందంగా కనిపించాలని చాలా తాపత్రేయపడతారు. రకరకాల నెయిల్ పాలిష్‌లు పెట్టుకుంటారు. అయితే వాటి వలన కలిగే దుష్ప్రభావాల గురించి ఆలోచించరు. నెయిల్ పాలిష్‌ని రెగ్యులర్‌గా పెట్టుకోవడం వలన బరువు అమాంతంగా పెరిగిపోతారని పరిశోధనల్లో తేలింది. ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనంతో నెయిల్ పాలిష్ తయారు చేస్తారు. 
 
ఈ రసాయనం ఒక ప్లాస్టిక్. ఫామ్ ఫర్నీచర్‌కి మంటలు అంటుకోకుండా వాడే ఈ రసాయనాన్ని నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు మన్నేందుకు ఉపయోగిస్తారు. వీటిని వాడటం వల్ల మానవ హార్మోన్లపై ప్రభావం పడుతుంది, దాంతో అమ్మాయిలు బరువు పెరుగుతారని పరిశోధకులు అంటున్నారు. దాదాపు 49 శాతం నెయిల్‌ పాలిష్‌లలో ట్రైఫెనైల్ ఫాస్పేట్ ఉంటుందని తేల్చారు. 
 
ఇలాంటి నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, వీటిని పెట్టుకున్న 10 నుండి 14 గంటల్లోపే మనలో టీపీహెచ్‌పీ పెరిగి బరువు పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అందుకే నెయిల్ పాలిష్‌ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఆర్టిఫీషియల్ నెయిల్స్ పెట్టుకొని నెయిల్ పాలిష్ వేసుకుంటే సమస్యలు రాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments