అలోవెరా.. స్ట్రాబెర్రీలు బరువును తగ్గిస్తాయా?

గురువారం, 27 జూన్ 2019 (11:21 IST)
స్థూలకాయంతో బాధపడేవారు వ్యాయామంతో పాటు కలబంద రసాన్ని తరచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కలబంద శరీర అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.


ఈ కలబంద రసం జీర్ణక్రియలు పెంచుటకు చక్కగా పనిచేస్తుంది. కప్పు వేడి నీటిలో కలబంద రసం, అల్లం ముక్క వేసి బాగా వేడిచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ సేవిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అధిక బరువును తగ్గించుటలో గ్రీన్ టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలానే గ్రీన్ టీలో కలబంద రసం వేసుకుని వేడిచేసి ఉదయాన్నే, రాత్రివేళ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అధిక బరువును తగ్గించుటకు స్ట్రాబెర్రీ పండ్లు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి, కనుక బరువు తగ్గించుటకు స్ట్రాబెర్రీ పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జ్ఞాపకశక్తి పెరగాలంటే.. దంపుడు బియ్యాన్ని తీసుకోండి..