అల్లం నోటి దుర్వాసనను దూరం చేస్తుందట..

అల్లం రసానికి సమానంగా తేనె కలిపి ఓ టీస్పూన్ చొప్పున మూడు పూటలా సేవిస్తే దగ్గు, ఉబ్బసం, జలుబు, అజీర్తి సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రెండు టీ స్పూన్‌ల అల్లం రసంలో ఒక టీ స్పూన్‌

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (09:45 IST)
అల్లం రసానికి సమానంగా తేనె కలిపి ఓ టీస్పూన్ చొప్పున మూడు పూటలా సేవిస్తే దగ్గు, ఉబ్బసం, జలుబు, అజీర్తి సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రెండు టీ స్పూన్‌ల అల్లం రసంలో ఒక టీ స్పూన్‌ తేనె కలిపి తాగితే.. తరుచూ కలిగే జలుబు, అలర్జీ సమస్యలు తొలగిపోతాయి. అల్లం రసాన్ని కొంచెం వేడి చేసి, రెండు మూడు చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది. 
 
సన్నగా తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర సమానంగా కలిపి నేతిలో దోరగా వేయించి ప్రతి ఉదయం పరగడపున తింటే అసిడిటీ దూరమవుతుంది. అల్లం, బెల్లం, నువ్వులు వీటిని సమానంగా దంచి ఉసిరికాయ ప్రమాణంలో రెండు పూటలా తింటూ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అల్లం మంచి యాంటీయాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. 
 
రక్త శుద్ధికి తోడ్పడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అల్లం కొన్ని వారాల పాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అల్లం నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాను నశింపజేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శుద్ధి చేసిన యురేనియంను మాకు ఇస్తారా లేదా నాశనం చేస్తారా? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Ebola : ఆఫ్రికాలో ఎబోలా-విజయవాడ ఎయిర్‌పోర్టులో పరీక్షా కేంద్రం

తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత నరహరి

సొంత పార్టీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ముచ్చెమటలు పోయించిన డిప్యూటీ సీఎం పవన్ (వీడియో)

వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పపై ఏసీబీ అక్రమాస్తుల కేసు- తిరుమల నెయ్యి కల్తీలోనూ..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments