Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టాలంటే..? ఇవి తీసుకోవాల్సిందే..

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:11 IST)
లో డెన్సిటీ లిపోప్రోటీన్ (ఎల్‌డీఎల్‌), దీనినే సాధారణ భాషలో చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇది మ‌న శ‌రీరంలో ఎక్కువ‌గా ఉంటే అనేక వ్యాధులు వ‌చ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా ముఖ్యంగా గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ వ‌చ్చే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. 
 
అందుకే చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌)ను త‌గ్గించుకొని, మంచి కొలెస్ట్రాల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్ లేదా హెచ్‌డీఎల్‌)ను పెంపొందించుకోవాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. అయితే క్రింద సూచించిన ప‌లు ఆహారాల‌ను నిత్యం తీసుకుంటూంటే శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా..! 
 
1. యాపిల్ : ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోవాలంటే రోజూ ఒక యాపిల్ తినాలి. యాపిల్‌లో ఉండే పోషక ప‌దార్థాలు లివ‌ర్ త‌యారు చేసే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించడంతోపాటు కొవ్వును క‌రిగిస్తాయి. బహుశా... అందుకేనేమో రోజూ ఒక యాపిల్ తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం రాద‌ని అంటూంటారు. 
 
2. బీన్స్‌: బీన్స్‌లో పీచు ప‌దార్థం (ఫైబ‌ర్‌) స‌మృద్ధిగా ఉండడంతో... ఇది కొలెస్ట్రాల్ త‌యారు కాకుండా చూడడంతోపాటు ఉన్న కొలెస్ట్రాల్‌ను కూడా క‌రిగిస్తుంది.
 
3. ద్రాక్ష‌: ద్రాక్ష పండ్ల‌లో ఆంతో సైనిన్స్, టానిన్స్ స‌మృద్ధిగా ఉండడం చేత ఇవి కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గిస్తాయి. ద్రాక్షలోని పొటాషియం శరీరంలోని విష పదార్థాలను బ‌య‌ట‌కు పంపుతుంది.
 
4. జామ: జామ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి, పాస్ఫ‌ర‌స్‌, నికోటిన్ యాసిడ్‌, ఫైబ‌ర్‌లు శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసి, కొలెస్ట్రాల్‌ను క‌రిగిస్తాయి.
 
5. పుట్టగొడుగులు: పుట్ట‌గొడుగుల్లో విట‌మిన్ బి, సి, కాల్షియం, ఇత‌ర మిన‌రల్స్ ఉండడంతో ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments