అసలే వర్షాకాలం.. ఆహారంలో శుభ్రత అవసరం.. ఈ టిప్స్ పాటించండి

అసలే వర్షాకాలం.. తీసుకునే ఆహారంలో శుభ్రత అవసరం. మనం తీసుకునే ఆహారం కలుషితమైతే.. కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలెన్నో వేధిస్తాయి. కాబట్టి భోజనం చేయటానికి ముందు మాత్రమే కాదు.. ఆహారం వండటానికి ముందూ చే

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (12:14 IST)
అసలే వర్షాకాలం.. తీసుకునే ఆహారంలో శుభ్రత అవసరం. మనం తీసుకునే ఆహారం కలుషితమైతే.. కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలెన్నో వేధిస్తాయి. కాబట్టి భోజనం చేయటానికి ముందు మాత్రమే కాదు.. ఆహారం వండటానికి ముందూ చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి. అంతేకాదు.. కూరగాయలను పచ్చి మాంసం వంటి వాటితో కలవకుండా చూసుకోవాలి. 
 
లేనట్లైతే మాంసానికి అంటుకుని ఉండే  బ్యాక్టీరియా వంటివి కూరగాయలకు వ్యాపించే ప్రమాదం వుంది. అలాగే వర్షాకాలంలో ఆహారాన్ని వేడివేడిగా తీసుకోవడం మంచిది. ఫ్రిజ్‌లో నిల్వ వుంచిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. వండిన పదార్థాలను వేడి వాతావరణంలో గంట కన్నా ఎక్కువసేపు బయట ఉంచితే వాటిల్లో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశముంది. దీంతో అది కలుషితమై రకరకాల అనర్థాలకు దారితీయొచ్చు. 
 
అందుకే ఓ పూటకు ఆ పూట వండుకుని తినడం మంచిది. వండి నిల్వ వుంచిన మాంసాహారంతోనే కాకుండా.. కూరగాయలతో చేసే ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అనర్ధాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అలాగే వర్షాకాలంలో వేడి వేడి సూప్‌లు, వేడి నీరు తీసుకోవడం మంచిది. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని, పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. నూనెతో వేయించిన ఆహార పదార్థాలు, గ్రిల్డ్ తండూరీ పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. వంటకాల్లో మిరియాలు, అల్లం, పసుపు, కొత్తిమీర, జీలకర్ర చేర్చుకోవాలి. ఓట్స్, శెనగలు, మొక్కజొన్న వంటి ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి. ఊరగాయలు, పచ్చళ్లు ఎక్కువ తీసుకోకూడదు. 
 
తేనేను వాడటం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. హోటళ్లు, బయటి చిరుతిళ్లను తినడం మానేయాలి. సిట్రస్ ఫ్రూట్స్ అయిన ఆరెంజ్‌ను తీసుకోవచ్చు. మొత్తంగా ఒకేసారి కాకుండా.. నాలుగైదు సార్లు పరిమితంగా ఆహారం తీసుకోవడం ద్వారా వర్షాకాలం అజీర్తిని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోర్ముజ్ జలసంధి మూసివేత.. దేశంలో పెట్రో ధరలు భగ్గు?

ఖమేనీ మృతిపై ప్రియాంకా మండిపాటు - కన్నుకు కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని గుడ్డిది చేస్తుంది...

అశ్లీల వీడియోపై తితిదే చైర్మన్ వివరణ.. సన్నాసులకు ఎడిటింగ్ కూడా సరిగ్గా రాదు (వీడియో)

చరిత్రలో అత్యంత క్రూరుడైన ఖమేనీ మరణించాడు.. ట్రంప్ ప్రకటన

ఆ వీడియోలో వున్నది నేను కాదు, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసా: తితిదే చైర్మన్ బి.ఆర్ నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. అల్లు వారింటికి విరోష్ దంపతులు...

ఒక రాత్రికి రేటెంత అని అనడుగుతారా? మీరు రాక్షసులే: రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం

Radha: మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్ షోకి జ్యూరీగా అనిల్ రావిపూడి, రాధ, లయ, హోస్ట్ గా శ్రీముఖి

VISA - వింటారా సరదాగా చిత్రం నుండి అనగా అనగా అమెరికా విడుదల

లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ నూతన కథాంశంతో చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments