Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఆకు కూరలు, పండ్లు అలా చేయకుండా తింటే డేంజర్...

చీడపీడల బారి నుంచి ఉపయోగించే పురుగుల మందులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. కూరగాయలు, పండ్ల విషయంలో అశ్రద్ధ చేసి కొని, తింటే ఇక ఆరోగ్యం పాడైనట్లేనంటున్నారు వైద్య నిపుణులు. క్యారెట్, బంగాళాదుంప, ఉల్లిపాయలు వంటివి నేల లోపల పండుతున్నప్పటికీ అ

Advertiesment
ఆ ఆకు కూరలు, పండ్లు అలా చేయకుండా తింటే డేంజర్...
, బుధవారం, 25 అక్టోబరు 2017 (22:19 IST)
చీడపీడల బారి నుంచి ఉపయోగించే పురుగుల మందులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. కూరగాయలు, పండ్ల విషయంలో అశ్రద్ధ చేసి కొని, తింటే ఇక ఆరోగ్యం పాడైనట్లేనంటున్నారు వైద్య నిపుణులు. క్యారెట్, బంగాళాదుంప, ఉల్లిపాయలు వంటివి నేల లోపల పండుతున్నప్పటికీ అక్కడ పురుగుల మందుల అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. 
 
మనం తొక్క తీసే అరటి, నారింజ వంటి వాటికి ఈ సమస్య పెద్దగా ఉండదు. క్యాబేజీలో పురుగుల మందు వాడకం ఎక్కువగా ఉంటుంది. పురుగుల మందులు క్యాబేజీపై వాడటం వల్ల అవశేషాలు లోపలికి చేరిపోవడం చాలా ఎక్కువ. క్యాబేజీపై వుండే నున్నటి మూడు పొరలను తొలగిస్తే మంచిది. మిర్చిపై కూడా పురుగుల మందులు వాడుతుంటారు. కాబట్టి ఇళ్ళలో పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగే వాడాలి.
 
కాలిఫ్లవర్‌లో పురుగుల మందుల అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. పువ్వుల మధ్యలో పురుగులను చంపేందుకు రసాయనాలు వాడుతారు. అందుకే పువ్వులన్నింటిని విడివిడిగా తీసి ఉప్పు ద్రవంలో నానబెట్టాలి. శుభ్రంగా కలిపి వండుకోవాలి. సలాడ్ తినడం మంచిది. కానీ అవి తినే ముందు శుభ్రంగా కడిగి తినాలి. కీరాలను కూడా శుభ్రంగా కడిగి తినాల్సిందే. టమోటా, బీన్స్, వంకాయలు చూడటానికి చాలా శుభ్రంగా ఉన్నట్లు కనిపిస్తాయి. తరిగే ముందు మాత్రం వీటిని కడగాలి. ద్రాక్షలో పురుగుల మందు ఎక్కువగా ఉంటుంది.
 
ద్రాక్షను శుభ్రంగా రుద్ది కడుక్కుని తినాలి. బిహెచ్ సి రకం పురుగుల మందును ఆకు కూరలకు వాడతారు. ఇవి చాలా డేంజర్. కొత్తిమీరతో పాటు మిగిలిన ఆకు కూరలన్నింటినీ ఉప్పు నీళ్ళలో కొద్దిసేపు ఉంచి ఆ తరువాత కడిగి మాత్రమే మరీ వాడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇవి పాటిస్తే మీ ఒంట్లో ఎంత వేడైనా చిటికెలో ఎగిరిపోతుంది...