అవిసె ఆకులతో ఆరోగ్యానికి ఎంతో మేలు.. నులిపురుగులు అంతం..

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (12:49 IST)
అవిసె ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకులను ముద్దగా చేసి చర్మం మీద పట్టుగా ఉపయోగించడం వల్ల గాయాలు, దెబ్బలు ఇట్టే మానిపోతాయి. అవిసె ఆకుకు బాగా వేడి చేసే గుణం ఉంటుంది. నీరసాన్ని సమూలంగా నివారిస్తుంది.
 
జలుబు కారణంగా నీరు బాగా కారి.. వచ్చే తలనొప్పి కోసం ఈ చిట్కా పాటించడం వల్ల సమస్య త్వరగా తగ్గిపోతుంది. చిన్న పిల్లలకు ఈ ఆకు రసంలో కొద్దిగా తేనె కూడా కలిపి తాపిస్తే నులిపురుగులు అంతం చేయవచ్చు. 
 
రేచీకటి ఉన్నవారు అవిసె ఆకులను మెత్తగా దంచి.. ఆ మిశ్రమాన్ని కుండలో పోసి ఉడకబెట్టాలి. అందులో నుంచి రసాన్ని తీసి సేవిస్తే రేచీకటి తగ్గిపోతుంది. అవిసె ఆకుల రసాన్ని చర్మంపై దద్దుర్లపై రాస్తే.. ఉపశమనం లభిస్తుంది. 
 
చర్మ సమస్యలున్న ప్రాంతంలో అవిసె ఆకుల రసాన్ని కొబ్బరి నూనెలో వేయించి.. పేస్టులా తయారు చేసుకుని రాస్తే మంచి ఫలితం వుంటుంది. అవిసె ఆకులతో పాటు పువ్వుల్లోనూ ఔషధ గుణాలున్నాయి. అవిసె పువ్వులను వేపులా చేసుకుని తీసుకోవచ్చు. ఇవి కంటి అలసటను దూరం చేస్తాయి. 
 
అవిసె ఆకులను ఆహారంలో చేర్చుకునేటప్పుడు మాత్రం మందులు వాడకూడదు. అవిసె ఆకులను అదేపనిగా తీసుకోవడం కూడదు. మాసానికి ఓసారి లేదా రెండు నెలలకు మూడుసార్లు మాత్రమే తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

పెళ్లికి ముందు కలిసి ఎంజాయ్ చేయడం... కాదంటే కేసు పెట్టడమా? మద్రాస్ హైకోర్టు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వున్న ఇమ్మడి రవి పేరు.. టికెట్ రేట్లు పెంచేస్తే?

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు : వైకాపా అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి అరెస్టు

నవంబర్ 19న అన్నదాత సుఖీభవ రెండవ విడత- రైతు ఖాతాల్లోకి నగదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments