Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానాటికీ పెరిగిపోతున్న మానసిక సమస్యలు (video)

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (10:55 IST)
తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మానసిక సమస్యలతో బాధపడే బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా భయం, ఒంటరితనం, ఒత్తిడి, యాంగ్జైటీ వంటివి ఉన్నట్టు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 
 
ముఖ్యంగా కోవిడ్ మొదలైన నాటి నుంచి మరింత తీవ్రంగా పరిస్థితి మారిపోయింది. దీంతో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అనేక ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ విషయం తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. 
 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల మంది ప్రజలు కుంగుబాటు సమస్యను ఎదుర్కొంటున్నారు. 8 లక్షల మంది యేటా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తేలింది. మలేరియా వల్ల కోల్పోతున్న ప్రాణాలకు ఇది రెట్టింపుగా ఉంది. 
 
రానున్న రెండు దశాబ్దాల్లో కేన్సర్, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులకు పెట్టే ఖర్చు కంటే ఎక్కువ మానసిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం చెబుతుంది. మానసిక ఆరోగ్య పరిరక్షణకు పెట్టే ప్రతి పైసా ఖర్చుకు వచ్చే సామాజిక, ఆర్థిక లాభాలు 3.3 నుంచి 5.7 రెట్లు ఎక్కువగా ఉంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

తర్వాతి కథనం
Show comments