Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిగుడ్డును తీసుకంటే.. అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం.. (video)

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (12:16 IST)
కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కావలసిన విటమిన్-ఎని గుడ్డు అందిస్తుంది. శరీరం బలహీనంగా ఉంటే రోజుకో ఉడకబెట్టిన గుడ్డు తినమని వైద్యులు సూచిస్తున్నారు. ఉడకబెట్టిన గుడ్డులో ఎ విటమిన్‌తో పాటు అన్ని రకాల సూక్ష్మపోషకాలు లభిస్తాయి. రోజుకి ఒక గుడ్డు తినడం అలవాటు చేసుకుంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే విటమిన్ ఏ కాలేయం, చేపలు, రొయ్యల్లో అధికంగా ఉంటుంది. ఇంకా పాలు, పాలపదార్థాల్లో కూడా సమృద్ధిగా లభిస్తుంది. క్యారెట్, చిలకడదుంప, ఆకుకూరలు, టొమాటో, క్యాప్సికం, బొప్పాయి, గుమ్మడి ఇలా ఆయా సీజన్లలో దొరికే తాజా పండ్లు తీసుకున్నా విటమిన్ ఎ శరీరానికి అందుతుంది.
 
ఇంకా కోడిగుడ్లలో ఉండే తెల్లనిసొనను రోజూ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. బరువు తగ్గాలనేకునేవారికి కోడిగుడ్లలో ఉండే తెల్లసొన చక్కగా పనిచేస్తుంది. దీంతో చాలా తక్కువ క్యాలరీలు వస్తాయి. దీనికి తోడు తెల్లసొన తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో తక్కువగా ఆహారం తీసుకుంటారు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.  
 
కోడిగుడ్లలో ఉండే తెల్లసొనను రోజూ తీసుకుంటే దాంతో హైబీపీ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తెల్లసొనలో ఉండే ప్రోటీన్లు మన శరీరంలో కండరాల నిర్మాణానికి పనికొస్తాయి. దీంతో కండరాలు దృఢంగా మారుతాయి. అందుచేత రోజుకో గుడ్డును పిల్లలకు ఇవ్వడం అలవాటు చేస్తే వారిలో పెరుగుదల వుంటుంది.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments