Webdunia - Bharat's app for daily news and videos

Install App

వానాకాలంలో మునగ గింజలను తీసి దంచి పొడి చేసి అలా తీసుకుంటే?

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (18:01 IST)
నీళ్లలోని హానికారక బ్యాక్టీరియాలను మునగ గింజల పొడి నాశనం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక మునగలో ఉండే మొరింగా ఓలీఫెరా కాటియోనిక్‌ ప్రొటీన్‌ (ఎంవోసీపీ) నీటిని శుద్ధిచేస్తుంది. మునగ గింజల పొడిని నీటిలో కలిపితే.. నీటిలోని ఘనపదార్థాలతో పాటు అడుగుభాగానికి చేరిపోతుంది. తద్వారా నీటిని ఆ ప్రొటీన్‌ శుద్ధి చేస్తుంది. దాదాపు 90-99 శాతం వరకు బ్యాక్టీరియా అంతు చూస్తుంది. 
 
కానీ, నీళ్లలో మాత్రం కొన్ని మూలకాలు.. సేంద్రియ పదార్థాలుంటాయి కాబట్టి.. అది చనిపోని బ్యాక్టీరియాకు ఆహారంగా మారి మళ్లీ బ్యాక్టీరియా వృద్ధిచెందే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎంవోసీపీని ఇసుకతో కలిపి నీటిని శుద్ధిచేస్తే.. ఆ సేంద్రియ పదార్థాన్ని సులభంగా తీసేయొచ్చంటున్నారు పరిశోధకులు. కాగా, పూర్వం ఈజిప్షియన్లూ మునగ విత్తనాల పొడిని కుండల లోపల రాసేవాళ్లు. 
 
అయితే అన్ని కాలాల్లో లభించే మునగకాయల గింజలు అందుకు అనువుగా ఉండవట. వర్షాకాలంలో కాసిన మునగకాయల్లోని గింజలైతే సమర్థంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వానాకాలపు గింజలను సేకరించి, వాటిని పొడి చేసి ఏ కాలంలోనైనా ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. అంతేకాదు.. మునగ గింజలే కాదు.. మునగ ఆకుకూ క్రిములను చంపే శక్తి ఉందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments