జుట్టు పెరగాలంటే.. క్యాప్సికమ్ తినాలని న్యూట్రీషియన్లు అంటున్నారు. ఎందుకంటే.. ఇందులో విటమిన్ సి ఎక్కువ. ఒక కమలాపండు నుంచి అందే విటమిన్ సితో పోలిస్తే.. పసుపు రంగు క్యాప్సికమ్‌లో విటమిన్ సి ఎక్కువ. ఒక కమలాఫలం నుంచి అందే విటమిన్ సితో పోలిస్తే... పసుపురంగు క్యాప్సికం నుంచి ఐదు రెట్లు అందుతుందట. అలానే దీనిలోని యాంటీ యాక్సిడెంట్లు జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
జుట్టుకే కాదు.. ఆరోగ్యానికి కూడా ఈ ఎల్లో క్యాప్సికమ్ ఎంతో మేలు చేస్తుందట. వీటిల్లో 92శాతం నీరు వుంటుంది. ప్రోటీన్లు, ఫ్యాట్స్ వుంటాయి.క్యాప్సికమ్ క్యాన్సర్‌కు చెక్ పెడుతుంది. అది ఏ రంగైనా సరే. గుండె సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. కంటి ఆరోగ్యానికి సహకరిస్తుంది. అలసటకు చెక్ పెడుతుంది. ఇందులోని ఐరన్, క్యాల్షియం మహిళల ఆరోగ్యానికి చెక్ పెడుతుందని న్యూట్రీషియన్లు చెప్తున్నారు.