Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయలు తింటే బరువు తగ్గుతారా? ఎలా? (Video)

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (23:18 IST)
కూరగాయల్లో వంకాయలకు ప్రత్యేకమైన స్థానం వుంది. ఈ వంకాయల్లో విటమిన్స్, మినరల్స్‌తో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వంకాయ తొక్కులో ఉండే యాంధోసియానిన్స్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కేన్సర్ కారకాలతో పోరాడతాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారికి వంకాయ ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 
వంకాయ శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ కె శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఏర్సడకుండా నిరోధిస్తుంది. వంకాయలో క్యాలరీస్ అస్సలు ఉండవు. కనుక బరువు తగ్గాలి అనుకుంటే మనం తరచూ వంకాయ తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియలు బాగా జరిగేలా చేస్తుంది.
 
వంకాయ రక్తంలోని చక్కెర స్ధాయిలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో రక్తప్రసరణ వ్యవస్ధను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. వంకాయను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగా ఉప్పుతో తింటే గ్యాస్ ట్రబుల్, ఎసిడిటి, కఫము తగ్గుతాయి. 
 
వంకాయలు ఆకలిని పుట్టిస్తాయి. వాతాన్ని తగ్గిస్తాయి. శుక్రాన్ని వృద్ధిచేస్తాయి. శరీరంలో వాపు, నరాల బలహీనతను తగ్గించే శక్తి వంకాయకు ఉంది. అంతేకాకుండా ఇది వృద్ధాప్య చాయలు దరిచేరనీయదు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

తర్వాతి కథనం
Show comments