Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ట్రో కూడా కరోనా లక్షణమే.. నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (15:07 IST)
కరోనా లక్షణాలు జ్వరం, జలుబు, దగ్గు, వాసన, రుచిని కోల్పోవడం వంటివని వైద్యులు చెప్తున్నారు. కానీ తాజాగా అయితే వాంతులు, విరేచనాలు, కడుపులో మంట, వికారం వంటి లక్షణాలు కనిపించినా వైరస్‌ సోకిందేమోనని అనుమానించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఎక్కువ మంది గ్యాస్ట్రో సంబంధిత సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనివల్ల వైరస్‌ తీవ్రత పెరిగి సమస్య మరింత జటిలమవుతోందంటున్నారు. 
 
కోవిడ్‌ బారినపడిన, వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో గ్యాస్ట్రో సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయని కేజీహెచ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గిరినాథ్ అంటున్నారు. అయితే చాలామంది వాటిని సాధారణ సమస్యలుగానే భావించి నిర్లక్ష్యం చేస్తుండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
  
కోవిడ్‌ వైరస్‌ బాధితుల్లో సాధారణంగా కనిపించే లక్షణాలకు భిన్నంగా కొంతమందిలో గ్యాస్ట్రో సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. వైరస్‌ బారినపడుతున్న ప్రతి వంద మందిలో 20 మందికి జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించడం లేదు. 
 
వీరిలో ఆకలి తగ్గడం, వికారం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవి కొవిడ్‌ లక్షణాల్లో లేకపోవడం వల్ల చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల వైరస్‌ తీవ్రత పెరిగి మరికొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments