Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెవుల్లో బడ్స్ వాడుతున్నారా.. కర్ణభేరి భారం పడితే?

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (13:23 IST)
చెవుల్లో బడ్స్ వాడుతున్నారా.. అయితే భవిష్యత్తులో చెవుడు ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెవుల్లో వుండే వ్యర్థాన్ని తొలగింతుకునే నిర్మాణం స్వతహాగా చెవుల్లోనే వుంటుందట. మనం ప్రత్యేకంగా వ్యర్థాన్ని తొలగించుకోవాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనంలో తేలింది. చెవులు సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు తేల్చేశారు. 
 
అలా కాకుండా ఇయర్ బడ్స్ ద్వారా క్లీన్ చేయాలని ప్రయత్నిస్తే లోపల వుండే గులిమి కొంత మాత్రమే బయటికి వస్తుందట. మిగిలినది ఇయర్ బడ్స్ తాకిడికి మరింత లోపలికి వెళ్లి ఇయర్ కెనాల్ నుంచి ప్రయాణించే కర్ణభేరిపై పడుతుందని పరిశోధకులు తెలిపారు. చెవిలోపలికి ప్రవేశించే ధ్వని తరంగాలకు అనుగుణంగా ప్రకంపనాలు సృష్టించి.. వాటిని మెదడుకు చేరవేయడం కర్ణభేరి విధి. 
 
అయితే అలా ఎక్కువ సంఖ్యలో గులిమి కర్ణభేరిపై పేరుకుపోతే.. సున్నితమైన కర్ణభేరి తరంగాలకు అనుగుణంగా ప్రకంపనాలు సృష్టించే సామర్థ్యం కోల్పోతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కంపిస్తున్న వస్తువుపై భారం పడితే.. అది కంపనాలను ఆపేస్తుందని వారు సూచిస్తున్నారు. ఇలా కర్ణభేరి పనికి ఆటంకం కలిగించడం వలన చెవుడు వస్తుందట. అందుకే చెవులు క్లీనింగ్ చేయడానికి బయట నుంచి ఎలాంటి వస్తువులు వాడకూడదని పరిశోధకులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments