Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ రోగులా.. పదేళ్ల జీవిత కాలం కట్టయినట్లేనట

యాబై ఏళ్లలోపు మధుమేహ వ్యాధికి గురయినవారి జీవితంలో పదేళ్లు కోతపడినట్లేనని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. 50 లక్షల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులపై చేసిన పరిశోధన అలాంటి వారి జీవిత కాలంలో పదేళ్ళు హరించుకుపోయినట్లేనని తేల్చి చెబుతోంది.

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (04:20 IST)
యాబై ఏళ్లలోపు మధుమేహ వ్యాధికి గురయినవారి జీవితంలో పదేళ్లు కోతపడినట్లేనని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. 50 లక్షల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులపై చేసిన పరిశోధన అలాంటి వారి జీవిత కాలంలో పదేళ్ళు హరించుకుపోయినట్లేనని తేల్చి చెబుతోంది. టైప్ 2 మధుమోహం ఊబకాయంతో ముడిపడి ఉంటుందని అందరికీ తెలుసు. టైప్ 2 వ్యాధిగ్రస్తులు ఊబకాయం కారణంగా గుండెపోటు, గుండె వ్యాధికి గురయ్యే అవకాశాలు 50 శాతం ఎక్కువగా ఉంటాయట. తాజా పరిశోధన ప్రకారం 50 ఏళ్ల లోపు వయస్సులో మధుమేహానికి గురైనవారు 75 ఏళ్ల వయస్సులోపే చనిపోయే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. 
 
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం 50 లక్షల మంది చైనీయుల్లో 50 ఏళ్లలోపువారు మధుమేహానికి గురైతే వారి జివిత కాలం లో కనీసం 9 ఏళ్లు వ్యాధి కారకంగా హరించుకుపోయిందని తేలింది. అయితే జీవన శైలిలో మార్పులు చేసుకున్న వారు నాటకీయంగా ముందస్తు మరణాలకు గురయ్యే స్థితినుంచి బయటపడుతున్నారని ఈ పరిశోధనా బృంద నేత ప్రొఫెసర్ జెంగ్‌మింగ్ చెన్ తెలిపారు.పాశ్చాత్య ఆహారంలో భాగమైన కొవ్వు, తీపి పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందడంతో జీవనశైలిలో మార్పులు తీసుకురావాలనుకుంటున్న ఆరోగ్య అధికారులు తీవ్రంగా శ్రమించాల్సివస్తోందని ఈ పరిశోధన పేర్కొంది. 
 
చిన్నవయస్సులోనివారు మధుమేహానికి గురవుతుండటం, వయోజనుల సంఖ్య పెరుగుతుండటం కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల వార్షిక మరణాల సంఖ్య పెరుగుతోందని, వ్యాధి నిర్ధారణ, చికిత్స పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోనివారు మృత్యువాతకు సులభంగా గురవుతున్నారని ఈ పరిశోధన హెచ్చరించింది. పాశ్చాత్య జీవనశైలి అలవర్చుకున్న కారణంగా చైనాలో గత కొన్ని దశాబ్దాల కాలంలోనే పది కోట్లకు పైగా వయోజనులు మధుమేహ బారినపడ్డారని, వీరిలో 50 ఏళ్లలోపులో మధుమేహ బారిన పడ్డవారు చాలావరకు వచ్చే 25 ఏళ్లలో మృత్యువాత పడే అవకాశాలు చాలా ఎక్కువని ఈ పరిశోధన తెలిపింది.
 
బ్రిటన్ రోగులు అక్కడి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వల్ల తమ వ్యాధి పట్ల జాగరూకులై ఉన్నారని, చైనాలో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని ప్రొఫెసర్ చెన్ చెబుతున్నారు. అయితే మధుమోహ వ్యాధిగ్రస్తులు భయపడాల్సిన పనిలేదని, రోజూ శారీరక శ్రమ చేయడం, మంచి ఆహారం తీసుకోవడం చేస్తే వారు ప్రమాదం నుంచి తప్పుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెన్ చెప్పారు. 
 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments