Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాప్సికమ్‌ను వాడితే.. మధుమేహం పరార్..

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:27 IST)
అనేక కూరగాయల లాగానే క్యాప్సికం కూడా మార్కెట్‌లో విరివిగానే లభిస్తోంది. బెంగుళూరు మిర్చిగా పిలవబడే ఈ కూరగాయ రకరకాల రంగుల్లో లభ్యమవుతోంది. కానీ రెగ్యులర్‌గా దొరికేవి పచ్చవి. ఇందులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఒక రోజుకు అవసరమయ్యే సి విటమిన్ ఒక క్యాప్సికం ద్వారా అందుతుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. 
 
క్యాప్సికంలో విటమిన్‌ సి, బి, ఇ, ఫోలిక్‌ యాసిడ్‌, యాంటి ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ఎంజైమ్‌లు అరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. బీటా కెరోటిన్ పసుపు రంగు క్యాప్సికంలో ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ సిలు టమోటాలో కంటే క్యాప్సికంలోనే ఎక్కువగా ఉంటాయి. 
 
కేలరీలు తక్కువగా ఉండే క్యాప్సికం జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడానికి క్యాప్సికం దోహదపడుతుంది. క్యాప్సికం తినడం వలన సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. దీనిని తింటే జుట్టు రాలకుండా ఉంటుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. మొటిమల నివారిణిగా కూడా క్యాప్సికం పనిచేస్తుంది. రోజువారీ ఆహారంలో భాగంగా క్యాప్సికంని చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments