Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారంతో మధుమేహం తప్పదు..

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (18:34 IST)
శాకాహారంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా జరిగిన పరిశోధనలో మాంసాహారం తీసుకునేవారి కంటే శాకాహారం తీసుకునే వారిలో అనారోగ్య సమస్యలు తక్కువని తేలింది. ఎందుకంటే శరీరానికి కావలసిన పోషకాలు ప్రోటీన్లు శాకాహారంలో పుష్కలంగా వుంటాయి. ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలే ఆరోగ్యానికి శక్తినిస్తాయని అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వవని న్యూట్రీషియన్లు అంటున్నారు.
 
ఇంకా శాకాహారం తీసుకునే వారిలో హృద్రోగ సమస్యలు చాలామటుకు తక్కువని పరిశోధనలో తేలింది. మాంసాహారం తీసుకునే వారిలో హృద్రోగాలైన గుండెపోటు వంటి ఇబ్బందులు తప్పట్లేదని పరిశోధన తేల్చింది. మాంసాహారం తీసుకోవడం ద్వారా అధిక ప్రోటీన్లు, కెలోరీలు, కొలెస్ట్రాల్, ధాతువులు లభించినా.. ఆరోగ్యానికి చేడు కలిగించేవి వున్నాయని పరిశోధకులు తేల్చారు. 
 
మాంసాహారం తీసుకునేవారి రక్తంలో అధిక శాతం కొలెస్ట్రాల్ వుండటంతో అవి హృద్రోగ సమస్యలకు దారితీస్తాయని, ఇందులోని ధాతువులతో అజీర్తి ఏర్పడుతుంది. ఇది కాలక్రమేణా అల్సర్‌కు దారితీస్తుందని తేలింది. అంతేగాకుండా మాంసాహారం తీసుకోవడం ద్వారా చర్మ సమస్యలు, అలెర్జీ, ఆస్తమా వంటి రుగ్మతలు కూడా తప్పవని పరిశోధకులు చెప్తున్నారు. 
 
ముఖ్యంగా శాకాహారం తీసుకునే వారిలో మధుమేహం వుండదని, మాంసాహారమే మధుమేహానికి దారితీస్తుంది. అలాగే అధిక రక్తపోటుకు కూడా కారణమవుతుందని పరిశోధనలో తేలింది. కానీ శాకాహారం తీసుకునేవారిలో..మానసిక ఆందోళన వుండదని.. ఉత్సాహం చేకూరుతుందని పరిశోధన తేల్చింది. సో శారీరక, మానసిక ఆరోగ్యానికి శాకాహారమే ఉత్తమం అన్నమాట. 

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments