Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమ్లేట్ పాన్‌కి అంటుకోకుండా రావాలంటే..?

ఆమ్లేట్ పాన్‌కి అంటుకోకుండా రావాలంటే..?
, శనివారం, 9 ఫిబ్రవరి 2019 (17:53 IST)
తేనె నిల్వ ఉండేందుకు... శుభ్రమైన సీసాలో పోసి రెండు లవంగాలను అందులో వేసి ఉంచాలి. బెల్లాన్ని నీటిలో కరిగించి.. ఆపై వడగట్టి పాకం పడితే ఇసుక రాకుండా ఉంటుంది. చపాతీలు తెల్లగా, మెత్తగా ఉండాలంటే.. పిండిలో నూనె, పాలు, బియ్యం పిండి వేసి ఐస్ నీళ్లతో కలపాలి. 
 
ఆమ్లేట్ పాన్‌కి అంటుకోకుండా రావాలంటే.. ఆమ్లేట్ వేసే ముందు పాన్‌పై కొద్దిగా ఉప్పు చల్లి చూడండి. మరలు బిగుసుకుపోయిన జాడీ మూతలను తేలికగా తీయాలంటే.. కొద్దిగా నూనెలో ఉప్పు కలిపి జాడీ మూతలకు పట్టించి కాసేపటి తరువాత తీస్తే తేలికగా తిరుగుతూ వచ్చేస్తాయి. ఇంట్లో ఫ్రిజ్ లేనప్పుడు పచ్చిమిరపకాయలను తడిలేకుండా తుడిచేసి ఓ స్పూన్ పసుపుపొడిని వాటికి పట్టించి గాజు డబ్బాలో వేసి గట్టిగా మూత బిగించి ఉంచితే వారం రోజులపాటు చెడిపోకుండా ఉంటాయి. 
 
నిమ్మరసం ఎక్కువగా రావాలంటే నిమ్మకాయలను 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో వేసి ఉంచాలి. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంటే రసం తీయడానికి 10 ముందు వాటిని బయటపెట్టాలి. వంట పాత్రలకు అంటుకున్న జిడ్డు పోవాలంటే నిమ్మచెక్కతో పాత్రలను బాగా రుద్దిన తరువాత నీటితో కడిగి, మెత్తటి వస్త్రంతో పాత్రలను తుడవాలి. పకోడీలను కలిపిన పిండిని పావుగంట పాటు ఊరనిచ్చి ఆ తరువాత కొన్ని వెల్లుల్లిపాయలను నూరి కలిపితే పకోడీలు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్దె ఇంట్లో ఉంటున్నారా..?