Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీలో ఆ సరుకు లేదా.. అయితే నిద్ర ఎలా పడుతుందీ?

రాత్రిపూట నిద్రపట్టడం లేదా.. తెల్లవారుజామును మెలకువ రావడం లేదా? అయితే మీలో జీవప్రక్రియకు సంబంధించిన గడియారం నిదానంగా పనిచేయడమే కారణం అని తాజా వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. రాత్రిపూట పూర్తిగా నిద్రపట్ట

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (06:46 IST)
రాత్రిపూట నిద్రపట్టడం లేదా.. తెల్లవారుజామును మెలకువ రావడం లేదా? అయితే మీలో జీవప్రక్రియకు సంబంధించిన గడియారం నిదానంగా పనిచేయడమే కారణం అని తాజా వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. రాత్రిపూట పూర్తిగా నిద్రపట్టకపోయినా, తెల్లవారుజామున త్వరగా నిద్రలేవలేకపోయినా మీలో జన్యు ఉత్పరివర్తనే కారణం అంటున్నారు న్యూయార్క్ లోని రాక్ ఫెల్లర్ యూనివర్శిటీ పరిశోధకులు.
 
మానవ జీవ పక్రియను నిర్దేశించే శరీరంలో లోపలి గడియారం సకాలంలో పనిచేయలేక పోవడమే మనిషి నిద్ర, మెలకువ సైకిల్‌ను మార్చిపేస్తోందని రాక్ ఫెల్లర్ అధ్యయనం చెబుతోంది. సిఆర్‌వై1 అనే ప్రత్యేక జన్యువు ఈ జీవ ప్రక్రియ గడియారంలో దూరటం వల్లే మనకు నిద్రపట్టకపోవడం, ఉదయం త్వరగా నిద్రపట్టక పోవడం జరుగుతుంటుందని వీరు చెబుతున్నారు. 
 
ఈ కొత్త జన్యువు శరీరంలోపలి జీవ ప్రక్రియా గడియారాన్ని నిదానంగా పనిచేయిస్తూ ఉంటుందని ఇలాంటి జన్యు ఉత్పరివర్తన కలిగిన మనుషుల నిద్రా సమయం ప్రతి రోజూ రాత్రి రెండు నుంచి రెండున్నర గంటలు స్లో అవుతూ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 
 
డిలేడ్ స్లీప్ పేస్ డిసార్డర్ (DSPD) అనే ఈ జన్యు పరివర్తన కారణంగానే వ్యక్తి జీవ ప్రక్రియకు చెందిన లయ మామూలు రాత్రి  పగలు సైకిల్ కంటే ఆలస్యంగా పని చేస్తుంటంది. ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది ఇలాంటి జన్యు ఉత్పిరివర్తన బారిన పడుతున్నారని వీరు చెప్పారు.
 
డీఎస్‌పీడి కారణంగా ప్రజలు రాత్రులు నిద్ర పోలేరు. కొన్న సార్లు చాలా ఆలస్యంగా నిద్రపడుతుంటుంది. దీనివల్ల సమాజానికి సంబంధించిన పనులు, ఉదయం చేయాల్సన పనులు వంటివాటికి వీరు దూరమై ఆందోళన, కుంగుబాటుకు గురవుతుంటారు. పైగా వీరికి గుండెజబ్బు, మదుమేహం కూడా కలిగే ప్రమాదం ఉందని పరిశోధకులు వ్యాఖ్య.
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

తర్వాతి కథనం
Show comments