Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుము నొప్పికి ఆయుర్వేద చికిత్స...

నడుము నొప్పిని కటిశూల అని ఆయుర్వేదంలో పిలుస్తారు. నడుంనొప్పి ఉన్నవాళ్ళు మొదట మూడు రోజులు ద్రవాహారం తీసుకుంటూ ఉపవాసంచేస్తే, జీర్ణాగ్ని సరిగ్గా తయారై కడుపులో ఆమం తగ్గి విష పదార్థాలు బయటకు వెళతాయి.ఆ తరువాత బరువైన ఆహారం తీసుకోకుండా ఉంటే అన్ని దోషాలూ తగ్గ

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (21:59 IST)
నడుము నొప్పిని కటిశూల అని ఆయుర్వేదంలో పిలుస్తారు. నడుంనొప్పి ఉన్నవాళ్ళు మొదట మూడు రోజులు ద్రవాహారం తీసుకుంటూ ఉపవాసంచేస్తే, జీర్ణాగ్ని సరిగ్గా తయారై కడుపులో ఆమం తగ్గి విష పదార్థాలు బయటకు వెళతాయి.ఆ తరువాత బరువైన ఆహారం తీసుకోకుండా ఉంటే అన్ని దోషాలూ తగ్గుతాయి.
 
ఆయుర్వేదంలో అష్టవర్గమనే సహజ మూలికలు చాలా ఉపకరిస్తాయి. ప్రతి రోజు విరోచనమవుతుంటే పూర్తి గా తగ్గుతుంది. అందుకు త్రిఫలాచూర్ణం రాత్రి పడుకునే ముందు తీసుకోవడం మంచిది. ప్రతిరోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం పావు గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుం నొప్పి తగ్గుతుంది.
 
అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణకోశం బాగుపడి నడుం నొప్పి తగ్గుతుంది. ఆవ నూనె, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వెడి నీళ్ళతో స్నానం చేస్తే నడుం నొప్పి తగ్గుతుంది. వంకాయ, వేరుసెనగ నూనె, మినప పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం మంచింది కాదు.
 
ఒళ్ళు లావుగా వుండి నడుంనొప్పి వుంటే, పావుగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మపండు రసం పోసి పరగడుపున త్రాగుతుంటే, ఒళ్ళు తేలిక పడి నొప్పి తగ్గుతుంది. ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను మంచి నడుంచూట్టూ కాపు పెడుతుంటే, నడుంనొప్పి తగ్గిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

తర్వాతి కథనం
Show comments