Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో క్యాబేజీ తురుము సూప్ తాగితే..

శీతాకాలంలో క్యాబేజీ తురుము సూప్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు క్యాబేజీ సూప్‌ను తీసుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. కంటి దృష్టి

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (12:38 IST)
శీతాకాలంలో క్యాబేజీ తురుము సూప్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు క్యాబేజీ సూప్‌ను తీసుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. కంటి దృష్టి సమస్యలు పోతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. క్యాబేజీలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు దంతాలకు, ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి. 
 
పచ్చి క్యాబేజీ జ్యూస్ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి. దంతాలను తెలుపుగా చేయడంలో క్యాబేజీ అమోఘంగా పనిచేస్తుంది. దీన్ని తరచూ తీసుకుంటే దంత సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి.
 
ఆల్కహాల్ సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాల నుంచి క్యాబేజీ సూప్ తప్పిస్తుంది. లివర్‌ను శుభ్రపరుస్తుంది. క్యాబేజీ సూప్‌గానూ, జ్యూస్‌గానూ తీసుకుంటే చర్మం కోమలంగా తయారవుతుంది. క్యాబేజీలో పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  
 
క్యాబేజీలో సల్ఫర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మానికి అందాన్నిస్తుంది. వెంట్రుకలను సంరక్షిస్తుంది. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులోని పొటాషియం రక్తనాళాలను తెరుచుకునేలా చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.
 
క్యాబేజీ సూప్ ఎలా చేయాలంటే? స్టౌ మీద పాన్ పెట్టి వెన్న రెండు స్పూన్లు వేసి వేడయ్యాక.. ఒక ఉల్లిపాయను సన్నగా తరగి.. వెన్నలో వేయించాలి. దోరగా వేగిన తర్వాత క్యాబేజీ తురుము, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. కొద్దిగా వేగాక పాలు చేర్చి ఉడికించాలి. తర్వాత జాజికాయ పొడి పావు స్పూన్ చేర్చి.. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి దించే సర్వ్ చేయాలి. అంతే క్యాబేజీ సూప్ రెడీ అయినట్లే. ఈ సూప్‌కు నేతిలో వేయించిన బ్రెడ్ ముక్కలతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments