Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించే వంకాయ

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (22:44 IST)
వంకాయలో విటమిన్స్, మినరల్స్‌తో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వంకాయ తొక్కులో ఉండే యాంధోసియానిన్స్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కేన్సర్ కారకాలతో పోరాడతాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారికి వంకాయ ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 
వంకాయ శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ కె శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఏర్సడకుండా నిరోధిస్తుంది. వంకాయలో క్యాలరీస్ అస్సలు ఉండవు. కనుక బరువు తగ్గాలి అనుకుంటే మనం తరచూ వంకాయ తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియలు బాగా జరిగేలా చేస్తుంది.
 
వంకాయ రక్తంలోని చక్కెర స్ధాయిలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో రక్తప్రసరణ వ్యవస్ధను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. వంకాయ రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగా ఉప్పుతో తింటే గ్యాస్ ట్రబుల్, ఎసిడిటి, కఫము తగ్గుతాయి. 
 
వంకాయలు ఆకలిని పుట్టిస్తాయి. వాతాన్ని తగ్గిస్తాయి. శుక్రాన్ని వృద్ధిచేస్తాయి. శరీరంలో వాపు, నరాల బలహీనతను తగ్గించే శక్తి వంకాయకు ఉంది. అంతేకాకుండా ఇది వృద్ధాప్య చాయలు దరిచేరనీయదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

Kodali Nani : అసోంలో కొడాలి నాని కీలక సహచరుడు కాళి అరెస్ట్

Chandrababu: పింఛన్ లబ్ధిదారుడి ఇంట కాఫీ తాగిన చంద్రబాబు (video)

ఏడుకొండలు ఇంటిలో కాఫీ తయారు చేసిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్ ల భైరవం ఫస్ట్ సింగిల్

తర్వాతి కథనం
Show comments