Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవికాలంలో దాహార్తి.. నేరేడు పండ్లను తీసుకుంటే?

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (14:43 IST)
వేసవి కాలంలో ఎక్కువగా నీరు తాగాలనిపిస్తుంది. కొంత మందికి దాహం చాలా ఎక్కువగా ఉంటుంది. అతి దాహాన్ని నివారించే గుణాలు నేరేడు పండ్లలో ఉన్నాయి. ఎండా కాలంలో వేడి చేయకుండా ఉండాలంటే నేరేడు పండ్లను తింటే మంచిది. ఇవి శరీరానికి చలువచేస్తాయి. మూత్రాశయ రోగాలను నయం చేయడంలో ఇవి తోడ్పడతాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి. 
 
కడుపులోని నులి పురుగులను నేరేడు పండ్లు నివారిస్తాయి. నోటి, మూత్రాశయ క్యాన్సర్‌లకు ఔషధంగా పనిచేస్తుంది. ప్రమాదవశాత్తూ కడుపులో చేరుకున్న వెంట్రుకలను సైతం నేరేడు కరిగిస్తుంది. 
 
నేరేడు పండ్ల రసంలో కొంచెం చెక్కర కలిపి తాగితే ఉదర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. నేరేడు విత్తనాలను ఎండబెట్టి చూర్ణం చేసి తరచుగా తీసుకుంటుంటే అతిమూత్ర వ్యాధి అదుపులో ఉంటుంది. నేరేడు పుల్లతో పళ్లు తోముకుంటే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ళు నుంచి రక్తస్రావం తగ్గుతుంది. 
 
నోటి దుర్వాసన దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నేరేడుపండ్లలో కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌, సోడియం, విటమిన్‌ సి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. 
 
నేరేడు పండ్లను తింటే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది, రక్తహీనత తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగవ్వాలంటే కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండ్ల రసం కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments