Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నల్ల మిరియాలను బాగా పొడిచేసి తీసుకుంటే, కరోనా వైరస్?

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (12:55 IST)
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోంది. ఐతే దీనిని అడ్డుకునేందుకు రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. ఇందుకు నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.

వీటిని మనం నిత్యం తీసుకునే ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్యాల నుండి బయటపడవచ్చు. వాటి వలన కలిగే కొన్ని ప్రయోజనాలు చూద్దాం. సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలకి ప్రత్యేక స్థానముంది. వీటిని మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మిరియాలలో మరికొన్ని రకాలు ఉన్నాయి. 
 
అవి తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగు మిరియాలు. ఆహారం తినకుండా మారాం చేసే పిల్లలకు ఒక టేబుల్ స్పూన్ బెల్లంలో అరచెంచా మిరియాల పొడి కలిపి రోజూ పెట్టడం వలన ఆకలి పెరుగుతుంది. మిరియాల పైపొరలో ఉండే ఫైటో న్యూట్రియంట్ సమ్మేళనాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేసి అనవసరమైన కొవ్వు పేరుకోకుండా కాపాడతాయి. ఫలితంగా రక్తనాళాల్లో అధిక కొవ్వు వల్ల వచ్చే రక్తపోటు నుంచి ఉపశమనం పొందవచ్చు. బరువు పెరగకుండా కూడా చూసుకోవచ్చు. 
 
ఆందోళన, ఒత్తిడి నుండి బయటపడటానికి మిరియాలలో ఉండే పైపెరైన్ అనే గుణం తోడ్పడుతుంది. శీతాకాలంలో జలుబు, దగ్గుతో బాధపడేవారు పాలలో మిరియాల పొడి కలుపుకుని తాగాలి లేదా మిరియాల రసం తాగితే కూడా మంచిదే. 50 గ్రాముల మిరియాల పొడిని 600 మిలీ నీళ్లలో చేర్చి అరగంట మరిగించాలి. ఆ నీటిని రోజుకు మూడుసార్లు తాగితే మంచిది. 
 
మిరియాల టీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని రోగ నిరోధక వ్యవస్థకు చేరుస్తుంది. చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకుంటే కండరాలు, నరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments