Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యానికి నల్ల వెల్లుల్లి, ఇది ఎలా దొరుకుతుంది?

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (23:02 IST)
నల్ల వెల్లుల్లి అనగానే అదేదో పంటపొలాల్లో లభిస్తుంది అనుకునేరు. ఇది తెల్ల వెల్లుల్లిపాయ రూపమే. దీనిని కిణ్వ ప్రక్రియ ద్వారా తయారుచేస్తారు. ఈ నల్ల వెల్లుల్లని సిద్ధం చేయడానికి, స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉంచబడుతుంది.


ఆ ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు ఉన్న తర్వాత అందులో కిణ్వ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనితో రంగు నల్లగా మారుతుంది. ఘాటు వాసన తేలికగా మారుతుంది. యాంటీఆక్సిడెంట్లు తెల్ల వెల్లుల్లి కంటే నల్ల వెల్లుల్లిలో చాలా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది సూపర్ ఫుడ్ కేటగిరీలో ఉంచబడుతుంది.

 
బ్లాక్ వెల్లుల్లి బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది. కనుక ఇది డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. నల్ల వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది.

 
ఇది గుండెకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. నల్ల వెల్లుల్లి జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్, హైబీపీని నియంత్రిస్తుంది. నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. హెచ్‌డిఎల్ స్థాయిని పెంచుతుంది అంటే మంచి కొలెస్ట్రాల్ అన్నమాట. అంతే కాకుండా ఇందులో ఉండే అల్లిసిన్ రక్తాన్ని పలుచన చేసి హార్ట్ బ్లాక్‌ను నివారిస్తుంది. ఈవిధంగా, నల్ల వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.

 
నల్ల వెల్లుల్లి మెదడు ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. బీటా-అమిలాయిడ్ అనే ప్రోటీన్ పేరుకుపోవడం వల్ల అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉందని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ నల్ల వెల్లుల్లి ఈ ప్రొటీన్ వల్ల మెదడులో మంటను తగ్గించి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అంటే అల్జీమర్స్ రోగులకు నల్ల వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది. బ్లాక్ వెల్లుల్లి క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడే అనేక లక్షణాలను కలిగి ఉంది. ఇది క్యాన్సర్ కణాలతో పోరాడటానికి సహాయపడే లక్షణాలను కలిగి ఉంది, అలాగే పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని భావిస్తారు.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments