Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్‌ను అశ్రద్ధ చేయొద్దు.. తలనొప్పి వస్తే వెంటనే?

Advertiesment
covid19
, మంగళవారం, 28 జూన్ 2022 (16:26 IST)
కోవిడ్‌ను కేర్ లెస్ చేయొద్దు. జలుబు, తలనొప్పి, కండరాల నొప్పులు వస్తే తేలికగా తీసిపారేయొద్దు. తలనొప్పి కూడా కోవిడ్ ప్రారంభ లక్షణమే అంటున్నారు వైద్యులు. కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితం అయ్యేవి ఊపిరితిత్తులు. అవి చెడిపోతే ప్రాణానికే ప్రమాదం. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ముందస్తు లక్షణాలను తేలికగా తీసుకోకుండా ముందు జాగ్రత్తలు పాటించండి.
 
అలాగే కోవిడ్ తొలిదశలో వచ్చే లక్షణాలలో తలనొప్పి ఒకటి. ఇది కోవిడ్ సోకిన తొలి రోజుల్లోనే కనిపిస్తుంది. సాధారణంగా మూడు నుంచి అయిదు రోజుల వరకు ఉంటుంది. కరోనా వైరస్ కారణంగా వచ్చే తలనొప్పి మధ్యస్థంగా నుంచి తీవ్రంగా మారుతుంది. తలపై కొడుతున్నట్టు, నొక్కుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. 
 
ఈ తలనొప్పి ఒక వైపే కాకుండా రెండు వైపులా వస్తుంది. కొందరిలో ఇది కరోనా వైరస్ వల్ల కలిగే దీర్ఘకాలిక లక్షణంగా మారుతుంది. కాబట్టి తలనొప్పి వదలకుండా వేధిస్తుంటే టెస్టు చేయించుకోవడం మంచిది.
 
అలాగే కండరాలలో నొప్పి కలగడం కూడా కరోనా వైరస్ తాలూకు ప్రారంభ సంకేతమనే చెప్పకోవాలి. కాలి కండరాలు, చేయి కండరాలు నొప్పి పెడతాయి. ఇది ముఖ్యంగా ఒమిక్రాన్ వేవ్ లో కనిపించ లక్షణం. కొందరిలో రోజువారి పనులు చేసుకోలేని విధంగా నొప్పి పెడతాయి. ఈ కండరాల నొప్పి వస్తే రెండు నుంచి మూడు రోజుల పాటూ ఉంటుంది. 
 
ఈ రెండు లక్షణాలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. అంతేకాదు ఈ రెండూ కోవిడ్ లక్షణాలని కూడా ప్రజలకు అవగాహన లేదు. తలనొప్పి, కండరాల నొప్పి బాధిస్తున్నప్పుడు కోవిడ్ టెస్టు చేయించుకోవడం ఉత్తమం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెరుగైన కుటుంబ ఆరోగ్యాన్ని నిర్థారించడానికి స్మార్ట్‌ స్నాకింగ్‌ ఎంపికల ఆవశ్యకత