Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో తాటి ముంజలను తింటున్నారా? బోలెడు ప్రయోజనాలున్నాయ్ తెలుసా?

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (15:52 IST)
వేసవికాలంలో మాత్రమే లభించే తాటి ముంజల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుందంటే నమ్మగలరా? ఔనండి..వీటిని ఐస్ ఆపిల్స్ అని అంటారు. ప్రకృతి ప్రసాదించిన వరం తాటి ముంజలు.


ఈ తాటి ముంజలలో అద్భుత ఔషధ గుణాలు ఉండడం వల్ల వీలైతే వీటిని ప్రతిరోజూ తినడానికి ప్రయత్నించండి. సాధారణంగా కల్తీ లేని తాటి ముంజలను ఇష్టపడని వారు ఉండరు.
 
తాటి ముంజల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
* తాటి ముంజలు శరీరంలో అధికంగా పేరుకున్న కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
* ముంజల్లో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది, రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
 
* ఇందులో ఉండే ఏ, బీ, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలును చేకూరుస్తాయి.
* తాటి ముంజలను తినడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
 
* గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి, చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచిది.
* లివర్ సమస్యలతో సతమతమవుతున్న వారు తీసుకుంటే మంచిదట.
 
* మొటిమలతో బాధపడుతున్న వారు తాటి ముంజలు లభించినన్ని రోజులు వాటిని తింటే తగ్గుముఖం పడతాయి.
* ఎండ వేడిమి వల్ల శరీరంలో కలిగే గ్లూకోజ్ హెచ్చుతగ్గులను నివారిస్తుంది.
 
* తాటి ముంజలో ఉండే పొటాషియం శరీరంలో పేరుకుని ఉన్న విషపదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
* మండే ఎండల కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది. ఆ సమయంలో ముంజలు తింటే శారీరక ఉపశమనం పొందవచ్చు. 
 
* కేన్సర్ కణాల నిరోధానికి సైతం ముంజలు ఉపయోగపడతాయి. ట్యూమర్, బ్రెస్ట్ కేన్సర్ కణాలను అభివ‌ృద్ధి చేసే పెట్రో కెమికల్స్, ఆంథోసైనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments