Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శరీరంలో క్యాల్షియం లోపిస్తే ఏమవుతుందో తెలుసా..?

Advertiesment
శరీరంలో క్యాల్షియం లోపిస్తే ఏమవుతుందో తెలుసా..?
, మంగళవారం, 12 మార్చి 2019 (14:56 IST)
హైపర్ టెన్షన్ లేదా హైబీపీ అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్యే. ఈ వ్యాధుల కారణంగా రక్తనాళాల గోడలు మందంగా మారి రక్తప్రసరణపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. పొగ పీల్చడం, ఆల్కహాల్ సేవించడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఎప్పుడూ కూర్చుని పనిచేయడం వంటి అలవాట్లు హైబీపీకి దారితీస్తాయి. హైపర్ టెన్షన్ నియంత్రించడానికి క్యాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలు అధిక మోతాదులో తీసుకోవాలి. 
 
శరీర వ్యవస్థలను నియంత్రించడంలో మెగ్నిషియం తోడ్పడుతుంది. బీపీ, షుగర్ స్థాయిలతోపాటు కండరాలు, నరాల వ్యవస్థలను నియంత్రించడంలో మెగ్నిషియం ఎంతో ఉపకరిస్తుంది. మూత్రం ద్వారా పొటాషియం, మెగ్నిషియంలను శరీరం భారీగా కోల్పోతుంది. కాబట్టి మెగ్నిషియం స్థాయిలను పెంచుకోవడం కోసం అరటి పండ్లు, అవకాడో, నట్స్, బ్లాక్ బీన్స్, బచ్చలి కూరలను ఎక్కువగా తీసుకోవాలి. 
 
ఎముకలను దృఢంగా ఉంచడంతోపాటు హైపర్ టెన్షన్‌‌ను అరికట్టడానికి క్యాల్షియం ఎంతో అవసరం. క్యాల్షియం లోపంతో బాధపడేవారికి హైబీపీ ముప్పు ఎక్కువ. శరీర క్రియలు సజావుగా సాగడానికి అవసరమైన హార్మోన్లు, ఎంజైమ్‌ల విడుదలలో క్యాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాలు, పెరుగు, వన్న, చేపలు, ఆకుకూరల్లో క్యాల్షియం విరివిగా లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నారై భర్తతో ఏడాదికి రెండుసార్లే శృంగారం... కానీ ఇప్పుడు?